Karimnagar: కరీంనగర్‌లో రూ. నిధులతో రోడ్లు, డ్రైనేజీలకు శంకుస్థాపన!
Karimnagar: కరీంనగర్ 48, 19 డివిజన్లలో UIDF నిధులతో సీసీ రోడ్డు, సీసీ డ్రైన్ పనులకు కేంద్ర మంత్రి బండి సంజయ్, మేయర్ కొలగాని శ్రీనివాస్ శంకుస్థాపన.
Karimnagar: కరీంనగర్‌లో రూ. నిధులతో రోడ్లు, డ్రైనేజీలకు శంకుస్థాపన!
కరీంనగర్: కరీంనగర్ నగరపాలక సంస్థ పరిధిలోని 48వ డివిజన్‌లో UIDF నిధులతో చేపట్టనున్న సీసీ రోడ్డు, సీసీ డ్రైన్ నిర్మాణ పనులకు కేంద్ర హోం శాఖ సహాయ మంత్రి, కరీంనగర్ పార్లమెంట్ సభ్యులు బండి సంజయ్ కుమార్ , నగర మేయర్ కొలగాని శ్రీనివాస్ తో కలిసి శంకుస్థాపన చేశారు.
అనంతరం 19వ డివిజన్ రేకుర్తి లో UIDF నిధులతో చేపట్టనున్న సీసీ రోడ్డు, సీసీ డ్రైన్ అభివృద్ధి పనులకు కూడా శంకుస్థాపన నిర్వహించారు.
ఈ సందర్భంగా నాయకులు మాట్లాడుతూ, నగరంలోని అన్ని డివిజన్లలో మౌలిక సదుపాయాల అభివృద్ధికి ప్రాధాన్యత ఇస్తున్నామని తెలిపారు. ప్రజలకు మెరుగైన రహదారులు, డ్రైనేజీ సౌకర్యాలు అందించేందుకు అభివృద్ధి పనులను వేగవంతంగా పూర్తి చేయనున్నట్లు పేర్కొన్నారు.
నగర అభివృద్ధే ప్రధాన లక్ష్యంగా కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల సహకారంతో విస్తృత స్థాయిలో అభివృద్ధి కార్యక్రమాలు చేపడుతున్నామని తెలిపారు. ప్రజల అవసరాలకు అనుగుణంగా ప్రతి డివిజన్‌లో రోడ్లు, డ్రైనేజీలు, తాగునీటి సదుపాయాలు, పారిశుధ్య మౌలిక వసతులను బలోపేతం చేస్తున్నామని పేర్కొన్నారు. UIDF నిధులను సమర్థవంతంగా వినియోగించి నగరాన్ని అన్ని రంగాల్లో అభివృద్ధి దిశగా ముందుకు తీసుకెళ్తామని అన్నారు.
నిర్మాణ పనులను నాణ్యత ప్రమాణాలకు అనుగుణంగా నిర్ణీత గడువులో పూర్తి చేయాలని అధికారులకు సూచించారు. అభివృద్ధి పనుల్లో ఎలాంటి నిర్లక్ష్యం సహించబోమని, ప్రజలకు ఇబ్బందులు కలగకుండా పనులు చేపట్టాలని ఆదేశించారు. ప్రతి రూపాయి ప్రజా ప్రయోజనాలకే వినియోగించబడేలా చర్యలు తీసుకుంటున్నామని స్పష్టం చేశారు.
స్థానిక ప్రజలు ఈ అభివృద్ధి పనుల పట్ల హర్షం వ్యక్తం చేస్తూ, తమ డివిజన్లలో మౌలిక వసతుల కల్పనకు ప్రత్యేక చొరవ తీసుకున్న కేంద్ర మంత్రి బండి సంజయ్ కుమార్, మేయర్ కొలగాని శ్రీనివాస్‌కు కృతజ్ఞతలు తెలిపారు.
ఈ కార్యక్రమంలో మున్సిపల్ కమిషనర్ ప్రఫుల్ దేశాయ్ , డిప్యూటీ మేయర్ వై. సునీల్ రావు , 48వ డివిజన్ కార్పొరేటర్ కర్రె పద్మ అనిల్ , 19వ డివిజన్ కార్పొరేటర్ సుదగోని మాధవి కృష్ణ, కార్పొరేటర్లు గాజా రమా శివరాం, మాసం గణేష్, సోమిడి వేణు, బండారి వేణు, మేకల వెంకటేష్, బండ రమణారెడ్డి, ఎన్నం లక్ష్మీ ప్రకాష్, దేశ శిల్ప వేదం, పెద్దపల్లి శ్రీలేఖ జితేందర్, దేవసాని సరస్వతి సత్యనారాయణ, కొలిపాక రమ్యశ్రీ శ్రీనివాస్, మున్సిపల్ అధికారులు, ఇతర కార్పొరేటర్లు, ప్రజాప్రతినిధులు, పార్టీ నాయకులు, కార్యకర్తలు, ఆయా డివిజన్ల ప్రజలు అధిక సంఖ్యలో పాల్గొన్నారు.




