Karimnagar: భౌతిక శాస్త్రంలో డాక్టరేట్ అందుకున్న మోడల్ స్కూల్ పీజీటీ కుందన్ కౌర్
Karimnagar: ఉస్మానియా విశ్వవిద్యాలయం 85వ స్నాతకోత్సవంలో గర్రేపల్లి మోడల్ స్కూల్ పీజీటీ కుందన్ కౌర్ భౌతిక శాస్త్రంలో డాక్టరేట్ పట్టా అందుకున్నారు.
Karimnagar: భౌతిక శాస్త్రంలో డాక్టరేట్ అందుకున్న మోడల్ స్కూల్ పీజీటీ కుందన్ కౌర్
కరీంనగర్: గర్రేపల్లి మోడల్ పాఠశాలలో భౌతిక శాస్త్ర PGT గా పని చేస్తున్న కుందన్ కౌర్, సెప్టెంబర్ 8, 2026 ఉస్మానియా విశ్వవిద్యాలయం నిర్వహించిన 85 వ స్నాతకోత్సవంలో భౌతిక శాస్త్రంలో డాక్టరేట్ పట్టా పొందారు.
ఓయూసిడబ్ల్యూ కు చెందిన భౌతిక శాస్త్ర విభాగం Head of the dept, డా॥ ఎస్. నరేంద్రబాబు మార్గదర్శకత్వంలో 'డిజైన్, సింథసిస్ అండ్ క్యారెక్టరైజేషన్ ఆఫ్ న్యూ కోర్ షెల్, నానోమెటీరియల్స్ ఫోర్ ఫోటోకాటలిసిస్ అప్లికేషన్స్' అనే అంశంపై ఆమె చేసిన పరిశోధనకుగాను ఉస్మానియా విశ్వవిద్యాలయం తనకు డాక్టరేట్ ను ప్రధానం చేశారు.
తన పరిశోధనకు సహకరించిన పర్యవేక్షకులు డా॥ ఎస్. నరేంద్రబాబు, ఓ.యూ.సి.డబ్ల్యూ, రసాయన శాస్త్ర విభాగం, ఓ.యూ కి చెందిన డా॥ సోమేశ్వర్ పొల కి ఆమె హృదయపూర్వక ధన్యవాదాలు తెలిపారు.
ఈ సందర్భంగా గర్రేపల్లి మోడల్ పాఠశాల ప్రిన్సిపాల్, తోటి ఉపాధ్యాయ సిబ్బంది, కుటుంబ సభ్యులు,భర్త సర్దార్ భగత్ సింగ్, తండ్రి సర్దార్ సేవా సింగ్, స్నేహితులు అభినందనలు తెలిపారు.




