Karimnagar:'ఎస్.ఐ.ఆర్' ప్రక్రియ వేగవంతం: 64 శాతం డిజిటైజేషన్ పూర్తి!
Karimnagar: కరీంనగర్‌లో స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ (SIR) 64% పూర్తయిందని కమిషనర్ ప్రఫుల్ దేశాయ్ తెలిపారు. పార్టీల ప్రతినిధులతో నిర్వహించిన వివరాలు చూడండి.
Karimnagar:'ఎస్.ఐ.ఆర్' ప్రక్రియ వేగవంతం: 64 శాతం డిజిటైజేషన్ పూర్తి!
కరీంనగర్: స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ ప్రక్రియలో 64 % శాతం డిజిటైజేషన్ పూర్తైందని కమీషనర్ ప్రఫుల్ దేశాయ్ అన్నారు. కరీంనగర్ నగరపాలక సంస్థ కార్యాలయంలో వివిధ రాజకీయ పార్టీల ప్రతినిధులతో ప్రత్యేక సమావేశం జరిగింది. ప్రస్తుతం నగరంలో కొనసాగుతున్న ప్రత్యేక ఓటర్ సవరణ ప్రక్రియ పురోగతిపై ప్రతినిధులతో సుదీర్ఘంగా చర్చించారు. క్షేత్ర స్థాయిలో సమస్యలను అడిగిన తెలుసుకున్నారు. ఎన్యుమరేషన్ ఫారాల సేకరణ, ఆన్ లైన్ నమోదు వేగవంతం అయ్యేందుకు సహకరించాలన్నారు. క్షేత్ర స్థాయిలో ఎదురౌతున్న సాంకేతిక సమస్యల పై పార్టీల ప్రతినిధులను ఆరా తీశారు.
ఈ సందర్భంగా కమీషనర్ మాట్లాడుతూ... ప్రత్యేక ఓటర్ల సవరణ ప్రక్రియ మరింత వేగవంతం చేసేందుకు పార్టీల ప్రతినిధులు సహకరించాలన్నారు. 8 రోజుల గడువు లోగా " సర్" ప్రక్రియ శాతాన్ని పెంచాలని, పిఎస్ ల వారిగా తక్కువ శాతం అయిన బూత్ ల పై దృష్టి పెట్టాలని కోరారు. ఎన్యుమరేషన్ ఫారాలను పూర్తి చేసి బిఎల్ఓ లకు తిరిగి అందజేసేలా చూడాలన్నారు. నమోదు ప్రక్రియ లో ఎలాంటి లోపాలు జరగకుండా.. అర్హులైన ప్రతి ఒక్కరికి ఓటు హక్కు కల్పించాలని కోరారు. పారదర్శకంగా ఓటర్ల జాబితా రూపొందించేలా రాజకీయ పార్టీల ప్రతినిధులు సహకరించాలన్నారు. 8 రోజుల గడువు మాత్రమే ఉన్నందున..పెండింగ్ ఉన్న పిఎస్ లలో ప్రక్రియ వేగవంతం అయ్యేలా చూడాలన్నారు. షిప్టెడ్, అన్ కలెక్టబుల్, డెత్ ఓటర్ల సమస్యలుంటే దృష్టికి తేవాలన్నారు. బూత్ లెవల్ అధికారులు ఇంటింటికి తిరిగి మిగిలిన ఎన్యుమరేషన్ ఫారాలను తప్పకుండ సేకరించాలన్నారు. ఎన్యుమరేషన్ ఫారాలను పూర్తి చేసిన వారు మీ బూత్ లెవల్ అధికారులకు సమర్పించి మీ ఓటు ఎస్ ఐఆర్ లో తప్పిపోకుండ జాగ్రత్తలు పాటించాలన్నారు. 8 రోజుల గడువు మాత్రమే ఉన్నందన ఎన్యుమరేషన్ ఫారాలను అందించి... ఆన్ లైన్ నమోదు చేసుకోవాలని పిలుపు నిచ్చారు. మొత్తం పిఎస్ ల వారిగా వంద శాతం పూర్తి చేసేలా పార్టీల ప్రతినిధులు ప్రత్యేక చొరవ తీస్కోవాలన్నారు. ఈ సమావేశంలో రాజకీయ పార్టీల నాయకులు వైద్యుల అంజన్ కుమార్, నాంపల్లి శ్రీనివాస్, సత్తినేని శ్రీనివాస్, సిరిసిల్ల అంజయ్య, మాజిద్ హుస్సెన్, ఎర్రవెల్లి రవీంధర్, ఎమ్మార్వోలు తదితరులు పాల్గొన్నారు.




