Thimmapur: ఇందిరానగర్ సర్పంచ్ రాంకిషన్ ఎన్నికల హామీల అమలు
Thimmapur: కరీంనగర్ జిల్లా తిమ్మాపూర్ మండలం ఇందిరానగర్ సర్పంచ్ ఆవుదుర్తి రాంకిషన్ సొంత ఖర్చులతో ఎన్నికల హామీలను అమలు చేస్తూ ప్రజలకు ఆర్థిక సాయం అందజేత.
Thimmapur: ఇందిరానగర్ సర్పంచ్ రాంకిషన్ ఎన్నికల హామీల అమలు
తిమ్మాపూర్: కరీంనగర్ జిల్లా తిమ్మాపూర్ మండలం ఇందిరానగర్ సర్పంచ్ ఆవుదుర్తి రాంకిషన్ కొత్త పథకానికి శ్రీకారం చుట్టారు. ఎన్నికల సమయంలో ప్రజలకు ఇచ్చిన హామీలను పక్కగా ఒక్కొక్కటిగా తన సొంత ఖర్చులతో అమలు చేస్తున్నారు. అందులో భాగంగా నేడు దుంత మహేశ్వరి కనకయ్య ల కూతురు వివాహానికి 5016 రూపాయలను అందజేశారు.
అలాగే పుట్టిన ప్రతి ఆడపిల్లకు కూడ 5016 రూపాయలను అందజేస్తామని చెప్పారు. అలాగే గ్రామంలో చనిపోయిన వ్యక్తి దహన సంస్కారాలకు 5000 రూపాయలను అందజేస్తుమన్నారు. ఎన్నికల సమయంలో తాను ఇచ్చిన హామీకి కట్టుబడి ఉన్నానని సర్పంచ్ రాంకిషన్ తెలిపారు.
గ్రామ అభివృద్ధికి ప్రజలు సహకరించాలని కోరారు. ఏవైనా గ్రామ సమస్యలు ఉంటే తన దృష్టికి తీసుకురావాలన్నారు.ఈ కార్యక్రమం లో ఉప సర్పంచ్ అలువాల ప్రణిత్, మాజీ సర్పంచ్ కాటిక వినోద,దామ అంజయ్య,అవుదుర్తి రంజీత్,కుంబం వెంకటేశ్,కూన రవి,కన్నం శివరామకృష్ణ, గంగిపెల్లి శంకర్,అలువాల నగెష్,రొడ్డ మహేష్, అరుణ,లక్ష్మీ, శ్రవంతి తదితరులు ఉన్నారు.




