Karimnagar: కరీంనగర్‌లో చిరుధాన్యాల సాగుపై రైతులకు శిక్షణ

Karimnagar: కరీంనగర్ రైతు విజ్ఞాన కేంద్రంలో షెడ్యుల్ కులాల ఉపప్రణాళిక (SC Sub Plan) కింద చిరుధాన్యాల సాగుపై రైతులకు ప్రత్యేక శిక్షణా కార్యక్రమం నిర్వహించారు.

G. SUDHAKAR, KARIMNAGAR
Published on: 24 Jun 2026 8:42 AM IST
Karimnagar
X

Karimnagar: కరీంనగర్‌లో చిరుధాన్యాల సాగుపై రైతులకు శిక్షణ

కరీంనగర్: తెలంగాణ రైతు విజ్ఞాన కేంద్ర, కరీంనగర్ లో షెడ్యుల్ కులాల ఉపప్రణాళిక ద్వారా చిరుధాన్యాల సాగులో మేలైన యాజమాన్య పద్ధతుల మరియు సస్యరక్షణపై శిక్షణా కార్యక్రమము మరియు వ్యవసాయ ఉత్పాదకాల పంపిణీ కార్యక్రమం నిర్వహించారు.

తెలంగాణ రైతు విజ్ఞాన కేంద్ర కరీంనగర్ ప్రొఫెసర్ జయశంకర్ తెలంగాణ వ్యవసాయ విశ్వవిద్యాలయం వారు ప్రతిష్టాత్మకంగా చేపట్టిన షెడ్యుల్ కులాల ఉపప్రణాళిక ద్వారా చిరుధాన్యాల సాగులో మేలైన యాజమాన్య పద్ధతులపై అవగాహన కార్యక్రమం ఏర్పాటు చేశారు.

ఈ సందర్భంగా ప్రిన్సిపాల్ ఇన్వెస్టిగేటర్ డా . బి .హరికృష్ణ మాట్లాడుతూ చిరుధాన్యాల సాగు వల్ల భూమి సారం తో పాటు అధిక లాభాలు పొందచ్చని వివరించారు. మేలైన యాజమాన్య పద్ధతులు అవలంబించడం వల్ల రైతులు లాభాలు పొందచ్చని మేలైన యాజమాన్య పద్ధతుల కోసం వ్యవసాయ పరిశోధన కేంద్ర అధికారులను ప్రొఫెసర్లను సంప్రదించి సలహాలు సూచనలు తీసుకోవచ్చని తెలిపారు.

కార్యక్రమానికి ముఖ్య అతిథి గా విచ్చేసిన, భారతీయ చిరుధాన్యాల సంస్ధ హైదరాబాద్ నుంచి విచ్ఛేసిన శాస్త్రవేత్తలు డా . అనురాధ, డా . దీపిక, డా . శ్రీనివాస్ చిరుధాన్యాల సాగు వివరాలు, ఖేత్ బచావో అభియాన్ కార్యక్రమం యొక్క ముఖ్య ఉద్దేశాలను రైతులకు చేరవేశారు.

రైతులు పంట మార్పిడి చిరుధాన్యాల సాగు వల్ల లాభాలు పొందచ్చని సూచించారు. అనంతరం చొప్పదండి, చిగురుమామిడి మండలాలకు చెందిన 40 మంది షెడ్యూల్ కులాల రైతులకు 3 కేజీ PYPS -2 జొన్నలు, 2 కేజీ PRS 2 రాగులు బయో పెస్టిసైడ్స్ ట్రీకోడెర్మా, ఇమిడాక్లోప్రిడ్, ప్రొపికోనజోల్ కార్బొఫురన్ గుళికలు, టార్పాలిన్లు తదితర వ్యవసాయ ఉత్పాదకాల పంపిణీ చేశారు.

ఈ కార్యక్రమంలో వ్యవసాయ పరిశోధన స్థానం కరీంనగర్ అధిపతి డా. బి.రాంప్రసాద్, శాస్త్రవేత్తలు డా.ఇ . రజనీకాంత్, డా. జి . ఉషారాణి, డా . ఇ . ఉమారాణి వ్యవసాయ పరిశోధన స్థానం సిబ్బంది మరియు అభ్యుదయ రైతులు పాల్గొన్నారు.

G. SUDHAKAR, KARIMNAGAR

G. SUDHAKAR, KARIMNAGAR

Next Story