Karimnagar: కరీంనగర్ రూరల్ పీఎస్‌లో ఘనంగా రాఖీ వేడుకలు!

Karimnagar: రూరల్ పోలీస్ స్టేషన్‌లో రాఖీ సంబరాలు ఘనంగా జరిగాయి. మహిళా పోలీస్ సిబ్బంది తోటి సిబ్బందికి, సీఐ నిరంజన్ రెడ్డికి రాఖీలు కట్టి స్వీట్లు పంచుకున్నారు.

SUDHAKAR, KARIMNGAR TOWN
Published on: 28 Aug 2026 7:41 AM IST
Karimnagar
X

Karimnagar: కరీంనగర్ రూరల్ పీఎస్‌లో ఘనంగా రాఖీ వేడుకలు!

Karimnagar: రేపు జరగనున్న రాఖీ పండుగను పురస్కరించుకుని కరీంనగర్ రూరల్ పోలీస్ స్టేషన్‌లో ఈరోజు రాఖీ సంబరాలను ఘనంగా నిర్వహించారు.

ఈ సందర్భంగా మహిళా పోలీస్ సిబ్బంది స్టేషన్‌లో విధులు నిర్వహిస్తున్న పోలీస్ సిబ్బందికి రాఖీలు కట్టి, స్వీట్లు పంచుకుని రాఖీ పండుగ శుభాకాంక్షలు తెలిపారు. పోలీస్ శాఖలో సోదరభావం, ఆత్మీయత, పరస్పర గౌరవాన్ని చాటేలా ఈ కార్యక్రమాన్ని నిర్వహించారు.

ఈ కార్యక్రమంలో కరీంనగర్ రూరల్ సీఐ అనుముల నిరంజన్ రెడ్డి, ఎస్‌ఐ లక్ష్మణ్ రెడ్డి, పోలీస్ సిబ్బంది పాల్గొన్నారు. మహిళా సిబ్బంది శైలజ, పద్మజ, రేనా, సుప్రియ, కీర్తన తదితరులు పోలీస్ సిబ్బందికి రాఖీలు కట్టి స్వీట్లు అందించారు.

ఈ సందర్భంగా సీఐ నిరంజన్ రెడ్డి మాట్లాడుతూ, రాఖీ పండుగ సోదర–సోదరీమణుల మధ్య ప్రేమ, ఆప్యాయత, రక్షణకు ప్రతీకగా నిలుస్తుందని తెలిపారు. పోలీస్ సిబ్బంది కుటుంబ సభ్యుల మాదిరిగా ఐకమత్యంతో విధులు నిర్వహిస్తూ ప్రజలకు మరింత మెరుగైన సేవలు అందించాలని ఆకాంక్షించారు.

SUDHAKAR, KARIMNGAR TOWN

SUDHAKAR, KARIMNGAR TOWN

Next Story