Karimnagar: వివాహిత నిండు ప్రాణం కాపాడిన కరీంనగర్ రూరల్ పోలీసులు!

Karimnagar: కరీంనగర్ రూరల్ పరిధిలోని దుర్షేడులో కుటుంబ కలహాలతో ఆత్మహత్యాయత్నం చేసిన వివాహితను పోలీసులు సమయస్ఫూర్తితో కాపాడారు.

G. SUDHAKAR, KARIMNAGAR
Published on: 25 July 2026 6:29 PM IST
Karimnagar
X

Karimnagar: వివాహిత నిండు ప్రాణం కాపాడిన కరీంనగర్ రూరల్ పోలీసులు!

Karimnagar: కుటుంబ కలహాలతో ఒంటిపై కిరోసిన్ పోసుకుని ఆత్మహత్యకు యత్నించిన ఓ వివాహితను పోలీసులు సమయస్ఫూర్తితో కాపాడారు.కరీంనగర్ రూరల్ పోలీస్ స్టేషన్ పరిధి దుర్షేడుకు చెందిన నేతి మానస (23) కుటుంబ కలహాల కారణంగా తీవ్ర మనస్తాపానికి గురై తన ఒంటిపై కిరోసిన్ పోసుకొని ఆత్మహత్యాయత్నానికి పాల్పడుతున్నట్లు కరీంనగర్ రూరల్ ఇన్‌స్పెక్టర్ ఆఫ్ పోలీస్ ఎ. నిరంజన్ రెడ్డి కి ఫోన్ ద్వారా సమాచారం అందింది.

వెంటనే స్పందించిన ఇన్‌స్పెక్టర్ ఆఫ్ పోలీస్ నిరంజన్ రెడ్డి బ్లూ కోల్ట్ సిబ్బంది పీసీ అఫ్జల్ ,హోం గార్డ్ ప్రసాద్లను సంఘటనా స్థలానికి పంపించారు. వారు వెంటనే అక్కడికి చేరుకుని మహిళను నిప్పంటించుకోకుండా అడ్డుకుని, ఆమెకు కౌన్సెలింగ్ నిర్వహించి, కుటుంబ సభ్యులకు సురక్షితంగా అప్పగించారు. ఆమెకు ఒక పాప కూడా కలదు. ఒక మహిళ ప్రాణాన్ని పోలీసులు సకాలంలో స్పందించి నిండు ప్రాణాన్ని కాపాడినందుకు కరీంనగర్ రూరల్ మండలం ప్రజలు హర్షం వ్యక్తం చేసినారు.

పోలీసు సిబ్బంది సమయస్ఫూర్తితో స్పందించి ఒక మహిళ ప్రాణాన్ని కాపాడినందుకు కరీంనగర్ రూరల్ ఇన్‌స్పెక్టర్ ఆఫ్ పోలీస్ ఎ. నిరంజన్ రెడ్డి, కానిస్టేబుల్ అబ్జల్ మరియు హోంగార్డు ప్రసాద్ లను ఏసిపి విజయ కుమార్ కమిషనర్ ఆఫ్ పోలీస్ గౌష్ ఆలం అభినందించారు.

కలహాలకు ఆత్మహత్యలు పరిష్కారం కాదు..

చిన్న చిన్న గొడవలు, కుటుంబ కలహాలు జరిగినప్పుడు ప్రతి ఒక్కరూ ఆలోచన చేయాలని పోలీసులు సూచించారు. ప్రతి సమస్యకు పరిష్కారం ఉంటుందని పరిష్కారం లేని సమస్యలు ఏమీ ఉండవని అందుకే సమస్యలు వచ్చినప్పుడు ఆలోచించాలి నిర్ణయాలు తీసుకోవాలి తప్ప ఆత్మహత్యలు చేసుకోదని అన్నారు. ప్రజలు కుటుంబ సమస్యలు లేదా వ్యక్తిగత ఇబ్బందులు ఎదురైనప్పుడు ఆవేశపూరిత నిర్ణయాలు తీసుకోకుండా కుటుంబ సభ్యులు, స్నేహితులు లేదా పోలీసులను సంప్రదించాలని కరీంనగర్ రూరల్ పోలీసులు సూచించారు.

G. SUDHAKAR, KARIMNAGAR

G. SUDHAKAR, KARIMNAGAR

Next Story