Karimnagar: కరీంనగర్‌లో ఏఐటీయూసీ రాష్ట్ర మహాసభలు ఏర్పాట్లు పరిశీలన
Karimnagar: కరీంనగర్‌లో సెప్టెంబర్ 6-8 వరకు ఏఐటీయూసీ 4వ రాష్ట్ర మహాసభలు. ఏర్పాట్లను పరిశీలించిన మాజీ ఎమ్మెల్యే చాడ వెంకటరెడ్డి, కలవేన శంకర్.
Karimnagar: కరీంనగర్‌లో ఏఐటీయూసీ రాష్ట్ర మహాసభలు ఏర్పాట్లు పరిశీలన
కరీంనగర్: ఏఐటీయూసి తెలంగాణ రాష్ట్ర 4వ మహాసభల సందర్భంగా ప్రధాన కూడళ్లలో ఏఐటీయూసీ తోరణాలు,జెండాలు,ఫ్లెక్సీలతో కరీంనగర్ ఎరుపుమయమైంది. సెప్టెంబర్ 6వ తేదీ నుండి 8వ తేదీ వరకు కరీంనగర్ నగరంలోని పద్మనాయక కళ్యాణ మండపంలో జరగనున్న మహాసభల ఏర్పాట్లను అలాగే 6వ తేదీన సర్కస్ గ్రౌండ్ లో జరిగే బహిరంగ సభ ఏర్పాట్లను మాజీ ఎమ్మెల్యే మహాసభల చీఫ్ ప్యాట్రన్ చాడ వెంకటరెడ్డి,ప్యాట్రన్ కలవేన శంకర్ పరిశీలించారు.
ఈ సందర్భంగా వెంకటరెడ్డి మాట్లాడుతూ వందేళ్ల కు పైగా ఉద్యమ చరిత్ర కలిగిన ఏఐటీయూసీ ప్రస్థానంలో కరీంనగర్ జిల్లా కేంద్రంలో మొట్టమొదటి సారి మహాసభలు జరుగుతున్నాయని, అన్ని రంగాల సంఘటిత, సంఘటిత రంగాలను, ప్రభుత్వ, ప్రైవేటు సంస్థల్లో పనిచేసే కార్మిక వర్గాన్ని ఏకతాటిపైకి తీసుకురావడంలో ఏఐటీయూసీ పాత్ర ఉందని, ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో సింగరేణి, బీడీ పరిశ్రమ, చేనేత పరిశ్రమలో పనిచేసే కార్మికులందరి హక్కుల పరిరక్షణ కోసం ఏఐటియూసి జెండా కింద అనేక పోరాటాల నిర్వహించి,ఎన్నో సంఘాలు నిర్మించడంలో కరీంనగర్ జిల్లా ముందుందని,ఎన్నో పోరాటాలు చేసి,విజయాలు సాధించిన చరిత్ర కరీంనగర్ కు ఉందని అలాంటి చరిత్ర కలిగిన ఏఐటీయూసీ రాష్ట్ర మహాసభల విజయవంతం కోసం అన్ని వర్గాల కార్మికులు వేలాదిగా తరలిరావాలని వెంకటరెడ్డి పిలుపునిచ్చారు.
ప్యాట్రన్ కలవేన శంకర్ మాట్లాడుతూ ఉత్తర తెలంగాణకు కేంద్ర బిందువైన కరీంనగర్ లో ఏఐటీయూసి రాష్ట్ర మహాసభలు జరగడం సంతోషకరమని, కార్మికుల హక్కులు,చట్టాలు కాపాడుకోవడం కోసం పోరాటాలు ఉదృతం చేయడం కోసం కరీంనగర్ లో జరిగే మహాసభ వేదిక కావాలని శంకర్ ఆకాంక్షించారు.
ఆహ్వాన సంఘం అధ్యక్ష,ప్రధాన కార్యదర్శి పంజాల శ్రీనివాస్,టేకుమల్ల సమ్మయ్య మాట్లాడుతూ ఏఐటీయూసి రాష్ట్ర మహాసభలకు ముఖ్య అతిథులుగా ఏఐటీయూసి జాతీయ ప్రధాన కార్యదర్శి అమర్ జిత్ కౌర్,వరల్డ్ ఫెడరేషన్ ట్రేడ్ యూనియన్ ఉప ప్రధాన కార్యదర్శి సి.శ్రీకుమార్,సిపిఐ రాష్ట్ర కార్యదర్శి కొత్తగూడెం ఎమ్మెల్యే కూనంనేని సాంబశివరావు,సిపిఐ సీనియర్ నాయకులు,మాజీ ఎమ్మెల్యే చాడ వెంకటరెడ్డి, సిపిఐ రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యులు కలవేన శంకర్ తో పాటు ఏఐటీయూసి రాష్ట్ర నిర్మాణ బాధ్యులు వి. ఎస్.బోస్,అధ్యక్ష,ప్రధాన కార్యదర్శి ఎం.డి.యూసఫ్,ఎస్.బాల్ రాజ్ హాజరవుచున్నారని, మూడు రోజుల పాటు జరిగే మహాసభకు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా వివిధ కార్మిక సంఘాలకు నాయకత్వం వహిస్తున్న 33 జిల్లాల నుండి కార్మిక ప్రతినిధులు దాదాపుగా 800 మంది హాజరవుచున్నారని వారందరికీ ఆతిధ్యం ఇవ్వడానికి కరీంనగర్ లో అన్ని ఏర్పాట్లు పూర్తయ్యాయని పేర్కొన్నారు.
6వ తేదీన మధ్యాహ్నం డాక్టర్ బి.ఆర్.అంబేద్కర్ స్టేడియం నుండి వన్ టౌన్,బస్టాండ్,గీతాభవన్ చౌరస్తా నుండి సర్కస్ గ్రౌండ్ వరకు భారీ కార్మిక ప్రదర్శన,ర్యాలీ ఉంటుందని అనంతరం సర్కస్ గ్రౌండ్ లో బహిరంగ సభ జరుగుతుందని,7,8 తేదీలలో పద్మనాయక కళ్యాణ మండలంలో ప్రతినిధుల మహాసభ జరుగుతుందని శ్రీనివాస్,సమ్మయ్య తెలిపారు. ఏర్పాట్లు పరిశీలించిన వారిలో సిపిఐ జిల్లా కార్యవర్గ సభ్యులు కొయ్యడ సృజన్ కుమార్, బోయిని అశోక్,నగర్ కార్యదర్శి కసిరెడ్డి సురేందర్ రెడ్డి,జిల్లా కౌన్సిల్ సభ్యులు పైడిపల్లి రాజు, కసిరెడ్డి మణికంఠ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.




