Karimnagar: కిష్టాపురం హనుమాన్ ఆలయంలో వైభవంగా ధ్వజస్తంభ ఆవిష్కరణ

Karimnagar: కరీంనగర్ జిల్లా రామడుగు మండలం కిష్టాపురం శ్రీ హనుమాన్ దేవాలయంలో ధ్వజస్తంభ ఆవిష్కరణ కార్యక్రమం అత్యంత వైభవంగా జరిగింది.

N. Madhusudan Reddy, Karimnagar
Published on: 25 Jun 2026 1:25 PM IST
Karimnagar
X

Karimnagar: కిష్టాపురం హనుమాన్ ఆలయంలో వైభవంగా ధ్వజస్తంభ ఆవిష్కరణ

Karimnagar: కరీంనగర్ జిల్లా రామడుగు మండలం కిష్టాపురం గ్రామంలోని శ్రీ హనుమాన్ దేవాలయంలో నూతనంగా ఏర్పాటు చేసిన ధ్వజస్థంభాన్ని ఘనంగా ఆవిష్కరించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా బీజేపీ చొప్పదండి నియోజకవర్గ కన్వీనర్ పెరుక శ్రవణ్ కుమార్ హాజరై ప్రత్యేక పూజలు నిర్వహించారు.

ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ భారతీయ సంస్కృతి, సనాతన ధర్మ పరిరక్షణలో దేవాలయాలు కీలక పాత్ర పోషిస్తున్నాయని అన్నారు. గ్రామాల్లో ఆధ్యాత్మిక వాతావరణాన్ని పెంపొందించేందుకు ఇలాంటి ధార్మిక కార్యక్రమాలు ఎంతో ఉపయోగపడతాయని పేర్కొన్నారు. హనుమాన్ స్వామి ఆశీస్సులతో ప్రజలందరూ సుఖశాంతులతో, ఆయురారోగ్యాలతో ఉండాలని ఆకాంక్షించారు.

అనంతరం ఆలయ కమిటీ సభ్యులు, గ్రామ పెద్దలు పెరుక శ్రవణ్ కుమార్‌ను శాలువాతో సన్మానించి కృతజ్ఞతలు తెలిపారు. కార్యక్రమంలో బీజేపీ నాయకులు, ఆలయ కమిటీ సభ్యులు, గ్రామస్థులు, భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.

N. Madhusudan Reddy, Karimnagar

N. Madhusudan Reddy, Karimnagar

Next Story