Karimnagar: సెప్టెంబర్ 17 వేడుకల కోసం కరీంనగర్‌లో బీజేపీ బైక్ ర్యాలీ!

Karimnagar: తెలంగాణ విమోచన దినాన్ని సెప్టెంబర్ 17న రాష్ట్ర ప్రభుత్వం అధికారికంగా నిర్వహించాలని కరీంనగర్‌లో బీజేపీ ఆధ్వర్యంలో బైక్ ర్యాలీ నిర్వహించి, కలెక్టర్‌కు వినతి పత్రం అందజేశారు.

G. SUDHAKAR, KARIMNAGAR
Published on: 15 Sept 2026 12:38 PM IST
Karimnagar
X

Karimnagar: సెప్టెంబర్ 17 వేడుకల కోసం కరీంనగర్‌లో బీజేపీ బైక్ ర్యాలీ!

Karimnagar: తెలంగాణ విమోచన దినాన్ని అధికారికంగా నిర్వహించాలని బిజెపి ఆధ్వర్యంలో తిరంగా,బైక్ ర్యాలీ నిర్వహించారు. ర్యాలీని తెలంగాణ చౌక్ నుండి బస్టాండ్ కమాన్ పలు ముఖ్య కూడళ్ల వెంట నిర్వహించి కలెక్టరేట్ కు చేరుకున్నారు. అనంతరం నాయకులు జిల్లా కలెక్టర్కు వినతి పత్రాన్ని అందించారు. ఈ సందర్భంగా బిజెపి జిల్లా అధ్యక్షుడు సాయిని మల్లేశం, కరీంనగర్ మేయర్ శ్రీనివాస్ మాట్లాడుతూ సెప్టెంబర్ 17న తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అధికారికంగా విమోచన దినాన్ని నిర్వహించాలని డిమాండ్ చేశారు.

తెలంగాణ విమోచనం కోసం ఎందరో తెలంగాణ పోరాడి అమరులయ్యారని అలాంటి అమరవీరులను గుర్తు చేసుకోవాల్సిన బాధ్యత మనందరిపై ఉందని తెలిపారు. అందుకే తెలంగాణ విమోచన దినాన్ని అధికారికంగా నిర్వహించాలని గత ప్రభుత్వాన్ని మొత్తాన్ని కోరుతున్నామని రాష్ట్ర ప్రభుత్వం కచ్చితంగా అధికారికంగా నిర్వహించాలని వినతి పత్రంలో కోరారు. దేశాన్ని ఒక్కటి చేసిన ఉక్కు మనిషి సర్దార్ వల్లభాయ్ పటేల్ ఆశయాలకు, మరియు తెలంగాణ విముక్తి కోసం 'ఆపరేషన్ పోలో' ద్వారా నిజాం నిరంకుశ పాలనకు వ్యతిరేకంగా పోరాడిన వీర జవాన్ల త్యాగాలను మనం ఎప్పటికీ మరువలేము అన్నారు. తెలంగాణ పాఠ్యపుస్తకాలలో తెలంగాణ అమరవీరుల చరిత్రను పిల్లలకు తెలిసే విధంగా ప్రింట్ చేయాలన్నారు. నగరంలో సర్దార్ వల్లభాయ్ పటేల్ స్మృతి వనాలు ఏర్పాటు చేయాలని ప్రభుత్వాన్ని కోరారు. ఈ కార్యక్రమంలో బిజెపి కార్పొరేటర్లు నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు.

G. SUDHAKAR, KARIMNAGAR

G. SUDHAKAR, KARIMNAGAR