Karimnagar: కలెక్టర్‌ను మర్యాదపూర్వకంగా కలిసిన ఎస్సీ డెవలప్‌మెంట్ డీడీ

Karimnagar: కరీంనగర్ జిల్లా నూతన ఎస్సీ డెవలప్‌మెంట్ DD గా బాధ్యతలు స్వీకరించిన భాగ్యలక్ష్మి కలెక్టర్ చిత్రా మిశ్రాను కలెక్టరేట్‌లో మర్యాదపూర్వకంగా కలిశారు.

G. SUDHAKAR, KARIMNAGAR
Published on: 15 July 2026 9:12 AM IST
Karimnagar
X

Karimnagar: కలెక్టర్‌ను మర్యాదపూర్వకంగా కలిసిన ఎస్సీ డెవలప్‌మెంట్ డీడీ

కరీంనగర్: కరీంనగర్ జిల్లా నూతన ఎస్సీ డెవలప్‌మెంట్ డిప్యూటీ డైరెక్టర్‌గా బాధ్యతలు స్వీకరించిన భాగ్యలక్ష్మి జిల్లా కలెక్టర్ చిత్రా మిశ్రాను కలెక్టరేట్‌లో మర్యాదపూర్వకంగా కలిశారు.

వరంగల్ జిల్లాలో విధులు నిర్వహించిన భాగ్యలక్ష్మి పదోన్నతిపై కరీంనగర్ జిల్లాకు బదిలీ అయ్యారు. ఎస్సీ డెవలప్‌మెంట్ డిప్యూటీ డైరెక్టర్‌గా బాధ్యతలు స్వీకరించిన అనంతరం జిల్లా కలెక్టర్‌ను కలిసి పుష్పగుచ్ఛం అందజేసి శుభాకాంక్షలు తెలిపారు.

ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ చిత్రా మిశ్రా ఆమెకు అభినందనలు తెలియజేస్తూ, జిల్లాలో ఎస్సీ సంక్షేమం, అభివృద్ధి కార్యక్రమాలను ప్రభుత్వ లక్ష్యాలకు అనుగుణంగా సమర్థవంతంగా అమలు చేయాలని సూచించారు.

G. SUDHAKAR, KARIMNAGAR

G. SUDHAKAR, KARIMNAGAR

Next Story