Karimnagar: ముమ్మరంగా కోతుల ముషీరాబాద్ ఆపరేషన్ 80 కోతుల పట్టివేత!
Karimnagar: కరీంనగర్ నగరపాలక సంస్థ పరిధిలో కోతుల బెడదకు చెక్. 13వ డివిజన్‌లో 80 కోతులను పట్టుకుని అటవీ ప్రాంతానికి తరలించిన అధికారులు.
Karimnagar: ముమ్మరంగా కోతుల ముషీరాబాద్ ఆపరేషన్ 80 కోతుల పట్టివేత!
Karimnagar: కరీంనగర్ నగరపాలక సంస్థ పరిధిలో సుదీర్ఘకాలంగా ప్రజలను వేధిస్తున్న కోతుల బెడద సమస్య పరిష్కారానికి అధికారులు ప్రత్యేక చర్యలు చేపట్టారు. ఇందులో భాగంగా నగరంలోని 13వ డివిజన్ మార్కండేయనగర్ తో పాటు దానికి సమీపంలో ఉన్న పలు కాలనీల్లో ముమ్మరంగా ఆపరేషన్ నిర్వహించి కోతులను పట్టుకున్నారు.
నగరపాలక సంస్థ వెటర్నరీ అధికారి దుర్గా ప్రసాద్ రెడ్డి ఆధ్వర్యంలో, నగరపాలక సంస్థ అనుమతించిన ప్రత్యేక ఏజెన్సీ ప్రతినిధులతో ఈ ప్రక్రియను చేపట్టారు. మార్కండేయనగర్ పరిసర ప్రాంతాల్లో దాదాపు 80 కోతులను సురక్షితంగా బోన్లలో బంధించి అనంతరం వాటికి ఎలాంటి హాని కలగకుండా వాహనాల్లో సురక్షితంగా అటవీ ప్రాంతానికి తరలించి విడిచిపెట్టారు.
ఈ సందర్భంగా వెటర్నరీ అధికారి దుర్గా ప్రసాద్ రెడ్డి మాట్లాడుతూ నగర వ్యాప్తంగా తీవ్రంగా ఉన్న కోతుల సమస్యకు శాశ్వత పరిష్కారం చూపేందుకు కార్పొరేషన్ ప్రత్యేక ప్రణాళికతో ముందుకు వెళ్తోందని తెలిపారు. నగర మేయర్, కార్పోరేషన్ కమీషనర్ ఆదేశాల మేరకు ప్రజల నుండి వచ్చే ఫిర్యాదులను ఎప్పటికప్పుడు పరిగణనలోకి తీసుకుంటున్నామని పేర్కొన్నారు.
ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా పట్టుకొని వాటిని సురక్షితంగా అటవీ ప్రాంతాలకు తరలిస్తున్నట్లు వెల్లడించారు. నగర వ్యాప్తంగా ఈ కార్యక్రమాన్ని నిరంతర ప్రక్రియగా కొనసాగిస్తామని తెలిపారు. ప్రజలకు కోతుల బెడదను పూర్తి స్థాయిలో పరిష్కరించేందుకు చర్యలు తీస్కుంటున్నట్లు తెలిపారు.




