Karimnagar: కరీంనగర్ ఓటరు జాబితా సవరణ కార్యక్రమంలో మేయర్
Karimnagar: కరీంనగర్ మేయర్ కొలగాని శ్రీనివాస్ తన ఓటరు వివరాలను సరిచూసుకున్నారు. ఓటరు జాబితా సవరణ కార్యక్రమాన్ని ప్రజలంతా సద్వినియోగం చేసుకోవాలని ఆయన పిలుపునిచ్చారు.
Karimnagar: కరీంనగర్ ఓటరు జాబితా సవరణ కార్యక్రమంలో మేయర్
కరీంనగర్: ఎన్నికల సంఘం నిర్వహిస్తున్న ప్రత్యేక ఇంటెన్సివ్ రివిజన్ (SIR) కార్యక్రమంలో భాగంగా కరీంనగర్ నగర మేయర్ కొలగాని శ్రీనివాస్ తన క్యాంపు కార్యాలయంలో 67వ బూత్‌కు చెందిన బూత్ లెవల్ ఆఫీసర్ (BLO) సమక్షంలో SIR ఫారంలో తన వ్యక్తిగత వివరాలను నమోదు చేసుకున్నారు.
అనంతరం నమోదైన వివరాలను డిజిటల్ విధానంలో ధ్రువీకరించి ఆన్‌లైన్‌లో నమోదు చేయించారు. ఈ సందర్భంగా మేయర్ మాట్లాడుతూ, ఎన్నికల సంఘం చేపట్టిన SIR కార్యక్రమాన్ని ప్రతి అర్హత ఓటరు సద్వినియోగం చేసుకోవాలని, తమ వివరాలను సక్రమంగా నమోదు చేసుకొని ఓటరు జాబితాను తప్పులులేని విధంగా రూపొందించేందుకు సహకరించాలని కోరారు.
ఓటరు జాబితాలో ప్రతి అర్హుడి పేరు సక్రమంగా ఉండేలా ప్రజలు తమ వివరాలను పరిశీలించి అవసరమైతే సవరణలు చేయించుకోవాలని సూచించారు. ప్రజాస్వామ్య పరిరక్షణలో ప్రతి ఓటు ఎంతో విలువైనదని, అందరూ ఎన్నికల సంఘానికి సహకరించాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో 67వ బూత్ BLOతో పాటు GPO పరశురాములు, సంబంధిత ఎన్నికల సిబ్బంది పాల్గొన్నారు.




