Karimnagar: కరీంనగర్‌లో రూ. 31 లక్షలతో అభివృద్ధి పనులకు శంకుస్థాపన

Karimnagar: కరీంనగర్ కార్పొరేషన్ పరిధిలోని 21వ డివిజన్‌లో రూ. 31 లక్షలతో పైప్‌డ్రైన్, సీసీ రోడ్డు పనులకు శంకుస్థాపన చేసిన మేయర్ కొలగాని శ్రీనివాస్.

G. SUDHAKAR, KARIMNAGAR
Published on: 26 July 2026 4:31 PM IST
Karimnagar
X

Karimnagar: కరీంనగర్‌లో రూ. 31 లక్షలతో అభివృద్ధి పనులకు శంకుస్థాపన

కరీంనగర్: కరీంనగర్ నగరపాలక సంస్థ పరిధిలోని 21వ డివిజన్ శ్రీరామ్ నగర్ రోడ్ నెం.1 లో అభివృద్ధి పనులకు ఈరోజు శంకుస్థాపన చేసిన మేయర్, డిప్యూటీ మేయర్. ఈ సందర్భంగా మేయర్ కొలగాని శ్రీనివాస్ మాట్లాడుతూ ప్రజల మౌలిక సదుపాయాల మెరుగుదల కోసం రూ. 31 లక్షల మునిసిపల్ సాధారణ నిధులతో చేపట్టనున్న పైప్ డ్రైన్ మరియు సి.సి. రోడ్డు నిర్మాణ పనులను ప్రారంభించామని తెలిపారు. నగర అభివృద్ధి లక్ష్యంగా నగరపాలక సంస్థ పనిచేస్తుందని అన్నారు. పనులను త్వరగా పూర్తిచేసి అందుబాటులోకి తీసుకురావాలని కాంట్రాక్టర్లకు సూచించారు.

ఈ శంకుస్థాపన కార్యక్రమంలో కరీంనగర్ నగరపాలక సంస్థ మేయర్ కొలగాని శ్రీనివాస్ , బీజేపీ రాష్ట్ర అధికార ప్రతినిధి, కరీంనగర్ నగరపాలక సంస్థ డిప్యూటీ మేయర్, మాజీ మేయర్ యాదగిరి సునీల్ రావు స్థానిక 21వ డివిజన్ కార్పొరేటర్ వరాల నరసింగం, కాలనీ పెద్దలు, స్థానిక నాయకులు మరియు ప్రజలు పెద్ద ఎత్తున పాల్గొన్నారు.

G. SUDHAKAR, KARIMNAGAR

G. SUDHAKAR, KARIMNAGAR

Next Story