Karimnagar: కరీంనగర్ లయన్స్ క్లబ్ ప్రతినిధుల విదేశీ పర్యటన
Karimnagar: శాతవాహన లయన్స్ క్లబ్ కరీంనగర్ సభ్యులు 40 మంది బ్యాంకాంగ్ పర్యటన. అంతర్జాతీయ ఎన్నికల్లో ఓటు వేసిన నూతన అధ్యక్షులు మర్రిపెల్లి మహేందర్.
Karimnagar: కరీంనగర్ లయన్స్ క్లబ్ ప్రతినిధుల విదేశీ పర్యటన
కరీంనగర్: కరీంనగర్ శాతవాహన లైన్స్ క్లబ్ నుండి నూతనంగా ఎన్నికైన సభ్యులు పాత సభ్యులు సుమారు 40 మంది బ్యాంకాంగ్ సెమినార్ లో పాల్గొన్నారు. ఈ సందర్భంగా నూతనంగా శాతవాహన లయన్స్ క్లబ్ కరీంనగర్ అధ్యక్షులుగా ఎన్నికైన మహేందర్ మాట్లాడుతూ కరీంనగర్ 320జి సభ్యులు అందరూ బ్యాంకాంగ్లో జరిగే ఎన్నికల ఓటింగు కోసం వచ్చినట్లు తెలిపారు. 320జి గవర్నర్ మోర బద్రేశం హాంకాంగ్ లో జరిగిన ఎన్నికల్లో పోటీ చేసి ఎన్నికైనట్లు చెప్పారు.
వారికి కరీంనగర్ తరఫున శుభాకాంక్షలు తెలుపుతూ మంచి పేరు ప్రఖ్యాతులు తీసుకు వస్తున్న మన కరీంనగర్ లైన్స్ క్లబ్ సభ్యులందరి కృషి వల్ల ఇది సాధ్యమైందన్నారు. లయన్స్ క్లబ్ స్థాపించి 108 సంవత్సరములు గడిచాయని ప్రతి సంవత్సరం ఒక్కొక్క దేశములో ఎన్నికలు నిర్వహిస్తూ సెమినార్లు నిర్వహిస్తారన్నారు. 192 దేశాల ప్రతినిధులు పాల్గొన్న ఈ సెమినార్లలో ఒకరి అభిప్రాయాలు ఒకరు షేర్ చేసుకుని ఎంతో నేర్చుకునే అవకాశం కలిగిందన్నారు.
మొదటిసారి కరీంనగర్ శాతవాహన లయన్స్ క్లబ్ అధ్యక్షుడిగా ఎన్నికయి హాంకాంగ్లో జరిగిన ఎన్నికల్లో ఓటు వేయడం చాలా ఆనందాన్ని కలిగించిందని తెలిపారు. కరీంనగర్ నుండి 40 మంది సభ్యులు ఈ పర్యటనలో పాల్గొన్నట్లు చెప్పారు. ఈ ఓటింగ్ లో పాత గవర్నర్లు, కొత్తగా ఎన్నికైన వారు, అన్ని దేశాల, జిల్లాల, మండలాల గవర్నర్లు ఈ ఓటింగ్ లో పాల్గొనే అవకాశం ఉంటుందని తెలిపారు. ఈ విదేశీ పర్యటన ప్రతి ఒక్కరికి కొత్త ప్రణాళికలు, చేపట్టబోయే పనులపై అవగాహన ఏర్పడుతుందన్నారు.
నూతనంగా ఎన్నికైన ప్రతి సభ్యుడికి శాతవాహన కరీంనగర్ లయన్స్ క్లబ్ తరఫున శుభాకాంక్షలు తెలుపుతున్నట్లు చెప్పారు. ఈ కార్యక్రమంలో జి 320జి గవర్నర్ మోరా బద్రేషం, శాతవాహన లైన్స్ క్లబ్ అధ్యక్షులు మర్రిపెల్లి మహేందర్,కాన్వెన్షన్ సెంటర్ పీడీజీ హెచ్ రాజిరెడ్డి, ఇతర సభ్యులు పాల్గొన్నారు.




