Karimnagar: కాంగ్రెస్ పాలనపై ధర్నాలు చేసే నైతిక హక్కు బీఆర్ఎస్కు లేదు

Karimnagar: కరీంనగర్‌లో సుడా మాజీ ఛైర్మన్ కోమటిరెడ్డి నరేందర్ రెడ్డి ప్రెస్ మీట్ నిర్వహించి, బీఆర్ఎస్ పాలనా వైఫల్యాలను, నేతల తీరును తీవ్రంగా ఎండగట్టారు.

SUDHAKAR, KARIMNGAR TOWN
Published on: 2 Sept 2026 5:36 PM IST
Karimnagar
X

Karimnagar: కాంగ్రెస్ పాలనపై ధర్నాలు చేసే నైతిక హక్కు బీఆర్ఎస్కు లేదు

కరీంనగర్: బిఆర్ఎస్ పార్టీ పదేళ్లు ప్రజలను మోసం చేసింది చాలక కాంగ్రెస్ ప్రభుత్వ ప్రజాపాలన పై ధర్నాలు చేయడమేంటని సుడా మాజీ ఛైర్మన్ కోమటిరెడ్డి నరేందర్ రెడ్డి మండిపడ్డారు.స్థానిక ముకరంపుర లోని తన కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ వెయ్యి రోజుల కాంగ్రెస్ పాలనపై ప్రజలు సంతృప్తి వ్యక్తం చేస్తున్నారని బిఆర్ఎస్ పార్టీకి ఇక భవిష్యత్తు కనిపించడంలేదని రోడ్డు మీదికొచ్చి ధర్నాలు చేస్తున్నారని నరేందర్ రెడ్డి విమర్శించారు.

ఎమ్మెల్యే గంగుల అధికారిక క్యాంపు కార్యాలయం వద్ద కాంగ్రెస్ పార్టీ పై ఫ్లెక్సీ ఏర్పాటు చేయడమేంటని దాన్ని వెంటనే తొలగించాలని ఇది మంచి పద్ధతి కాదని తొలగించకపోతే పదేళ్ల బీఆర్ఎస్ దోపిడీపై కూడళ్ల వద్ద ఫ్లెక్సీలు ఏర్పాటు చేస్తామని నరేందర్ రెడ్డి హెచ్చరించారు.కేసీఆర్ కుటుంబ దోపిడీని కేసీఆర్ కూతురు కవిత దృవీకరిస్తుందని ఆదోపిడి పైసలు ఇంకా లెక్కపెట్టుకుంటున్నారని స్వయంగా ఆమెనే చెబుతుందని ఏముఖం పెట్టుకుని ధర్నాలు చేస్తున్నారని నరేందర్ రెడ్డి మండిపడ్డారు.

మీ హయాంలో డబుల్ బెడ్రూమ్ ఇండ్లు ఎందుకు ఇవ్వలేదో దళితులకు 3 ఎకరాల భూమి ఇస్తామని ఎందుకు మోసం చేశారో ఇలా అనేక హామీలు ఇచ్చి ఎందుకు ఒక్కటైనా నెరవేర్చలేదో మొదట ప్రజలకు చెప్పి కాంగ్రెస్ ప్రభుత్వం పై మాట్లాడాలని నరేందర్ రెడ్డి డిమాండ్ చేశారు.ప్రజలకు ఇచ్చిన హామీలను నెరవేర్చుకుంటూ ప్రజాపాలన సాగిస్తున్న కాంగ్రెస్ ప్రభుత్వాన్ని విమర్శించే నైతిక అర్హత బీఆర్ఎస్ పార్టీకి లేదని నరేందర్ రెడ్డి పేర్కొన్నారు.

కేటీ రామారావు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పై హద్దులు దాటి మాట్లాడుతున్నాడని పద్దతి మార్చుకోకపోతే కాంగ్రెస్ కార్యకర్తలు కన్నెర్ర చేస్తారని హెచ్చరించారు.కాంగ్రెస్ ప్రభుత్వం అమలుపరుస్తున్న సంక్షేమ పథకాలలో పాల్గొంటున్న ఎమ్మెల్యే గంగుల కమలాకర్ తానే స్వయంగా లబ్ధిదారులకు వివిధ రకాల పథకాలు అందిస్తూ పథకాలు అమలు కావడంలేదని మాట్లాడడం విడ్డూరంగా ఉందని నరేందర్ రెడ్డి మండిపడ్డారు.

ప్రజలు అన్నీ గమనిస్తున్నారని ఎన్ని డ్రామాలు చేసినా బిఆర్ఎస్ ను ప్రజలు నమ్మరని నరేందర్ రెడ్డి పేర్కొన్నారు.ఈ విలేకరుల సమావేశంలోకుర్ర పోచయ్య,మామిడి సత్యనారాయణ రెడ్డి, లక్కీరెడ్డి కిరణ్ రెడ్డి,ముక్క భాస్కర్,భారీ,తోట అంజయ్య,షబానా, గుడిపాటి రమణ రెడ్డి,ఫజల్,ఖలీల్,హనీఫ్ తదితరులు పాల్గొన్నారు.

SUDHAKAR, KARIMNGAR TOWN

SUDHAKAR, KARIMNGAR TOWN

Next Story