Karimnagar: గంగాధరలో అకాల వర్షం బీభత్సం: తడిసి ముద్దయిన వరి ధాన్యం.. రైతుల కన్నీరు!
Karimnagar: కరీంనగర్ జిల్లా గంగాధర మండలంలో కురిసిన అకాల వర్షానికి కొనుగోలు కేంద్రాల్లోని వరి ధాన్యం తడిసి ముద్దయింది.
Karimnagar: గంగాధరలో అకాల వర్షం బీభత్సం: తడిసి ముద్దయిన వరి ధాన్యం.. రైతుల కన్నీరు!
గంగాధర: కరీంనగర్ జిల్లా గంగాధర మండలం పరిధిలోని పలు గ్రామాల్లో ఈదురు గాలులతో కూడిన అకాల వర్షం కురవడంతో కొనుగోలు కేంద్రాల్లో నిల్వ ఉంచిన వరి ధాన్యం పూర్తిగా తడిసి ముద్దయింది. దీంతో రైతులు తీవ్ర ఆందోళనకు గురయ్యారు.
రైతులు తెలిపిన వివరాల ప్రకారం, సుమారు 20 రోజుల క్రితమే కొనుగోలు కేంద్రాలకు తీసుకొచ్చిన వరి ధాన్యాన్ని ఇప్పటివరకు తూకం వేయకపోవడంతో పాటు రైస్ మిల్లులకు కూడా తరలించలేదని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. అధికారుల నిర్లక్ష్యం, కొనుగోలు ప్రక్రియలో జాప్యం కారణంగానే తమ పంట నష్టపోయిందని రైతులు ఆరోపిస్తున్నారు.
ఆరుకాలం కష్టపడి పండించిన పంట కేవలం 15 నిమిషాల వర్షానికే తడిసి పోవడంతో రైతులు కన్నీరుమున్నీరవుతున్నారు. ఇప్పటికే పెట్టుబడులు పెరిగి ఆర్థికంగా ఇబ్బందులు ఎదుర్కొంటున్న సమయంలో ఈ ఘటన తమను మరింత కుంగదీసిందని రైతులు వాపోతున్నారు. అకాల వర్షంతో తడిసిన ధాన్యాన్ని ప్రభుత్వం వెంటనే కొనుగోలు చేయాలని రైతులు డిమాండ్ చేశారు.




