Karimnagar: మర్రివానిపల్లిలో ఉచిత వైద్య శిబిరం ఉచితంగా పరీక్షలు, మందుల పంపిణీ!

Karimnagar: ఇల్లంతకుంట మండలం మర్రివానిపల్లిలో ఆదిత్య అమృత హాస్పిటల్ ఆధ్వర్యంలో ఉచిత వైద్య శిబిరం. ఉచితంగా షుగర్ పరీక్షలు మరియు మందుల పంపిణీ.

GANESH, JAMMIKUNTA
Published on: 3 Sept 2026 7:26 AM IST
Karimnagar
X

Karimnagar: మర్రివానిపల్లిలో ఉచిత వైద్య శిబిరం ఉచితంగా పరీక్షలు, మందుల పంపిణీ!

Karimnagar: కరీంనగర్ జిల్లా ఇల్లంతకుంట మండలం మర్రివానిపల్లి గ్రామంలో జమ్మికుంట ఆదిత్య అమృత హాస్పిటల్ ఆధ్వర్యంలో ఉచిత వైద్య శిబిరం నిర్వహించడం జరిగినది.

దీనిలో భాగంగా ప్రముఖ వైద్య నిపుణులు డాక్టర్ ఆకుల శ్రీనివాస్ జనరల్ మెడిసిన్, డాక్టర్ భరత్ న్యూరాలజిస్ట్ మరియు డాక్టర్ గ్రీష్మ గైనకాలజిస్ట్ చే వైద్య పరీక్షలు నిర్వహించి రోగులకి ఉచిత షుగర్ పరీక్షలు అవసరమైన మందులు పూర్తి ఉచితంగా అందజేయడం జరిగినది.

ఇంత గొప్ప కార్యక్రమాన్ని నిర్వహించిన గ్రామ సర్పంచ్ మర్రి శ్రీనివాస్ రెడ్డి, ఉప సర్పంచ్ కడారి పద్మ - నవీన్ వార్డు కౌన్సిలర్లు జుజాటి శ్రీవాణి, ఎడ్ల చిరంజీవి, ఎరుబాటి నాగరాజు, రౌతు రాజేష్, కోడం సంజీవ్, బైరి రవీందర్, ఏనుగు శోభారాణి ఇతర గ్రామ పెద్దలకు ఆదిత్య అమృత హాస్పిటల్ మేనేజింగ్ డైరెక్టర్ దేవేందర్ రెడ్డి ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేశారు.

గ్రామాల్లో పేదలకి ఉపయోగపడే కార్యక్రమాలు ముందు ముందు వివిధ గ్రామాలకు మా ఉచిత వైద్య సేవలను అందజేయడంలో ఆదిత్య అమృత హాస్పిటల్ యాజమాన్యం ముందుంటావని తెలియజేశారు.

GANESH, JAMMIKUNTA

GANESH, JAMMIKUNTA

Next Story