Karimnagar: బ్యాంకులో డబ్బులు డ్రా చేస్తూ రైతు గుండెపోటుతో మృతి!
Karimnagar: జంగపల్లికి చెందిన రైతు హనుమండ్ల బాలయ్య (65) గుండ్లపల్లి ఎక్స్ రోడ్‌లోని ఎస్బీఐ బ్యాంకులో డబ్బులు డ్రా చేస్తుండగా గుండెపోటుతో కుప్పకూలి మృతి చెందారు.
Karimnagar: బ్యాంకులో డబ్బులు డ్రా చేస్తూ రైతు గుండెపోటుతో మృతి!
కరీంనగర్ జిల్లా: గన్నేరువరం మండలం జంగపల్లి గ్రామానికి చెందిన రైతు హనుమండ్ల బాలయ్య (65), తండ్రి కనుకయ్య, గుండెపోటుతో మృతి చెందారు.
ఈ రోజు మధ్యాహ్నం గుండ్లపల్లి ఎక్స్‌రోడ్‌లోని ఎస్బీఐ బ్యాంకుకు డబ్బులు డ్రా చేసేందుకు వెళ్లిన బాలయ్య డబ్బులు డ్రా చేస్తుండగా అకస్మాత్తుగా గుండెపోటుకు గురై బ్యాంకులోనే కుప్పకూలిపోయారు. గమనించిన స్థానికులు వెంటనే ఆసుపత్రికి తరలించేందుకు ప్రయత్నించినప్పటికీ అప్పటికే మృతి చెందారు
Next Story




