Karimnagar: అభివృద్ధి అంతా కేంద్ర నిధులతోనే – మాజీ మేయర్ సునీల్ రావు!
Karimnagar: కరీంనగర్ అభివృద్ధి పనులన్నీ కేంద్ర నిధులతోనే సాగుతున్నాయని మాజీ మేయర్ సునీల్ రావు స్పష్టం చేశారు.
Karimnagar: అభివృద్ధి అంతా కేంద్ర నిధులతోనే – మాజీ మేయర్ సునీల్ రావు!
Karimnagar: రాష్ట్రంలో, జిల్లాలో జరిగే అన్ని అభివృద్ధి పనులు కేంద్ర ప్రభుత్వ పథకాలేనని మాజీ మేయర్ సునీల్ రావు అన్నారు. నేడు మీడియాతో సునీల్ రావు మాట్లాడుతూ కాంగ్రెస్ నాయకులు చేసిన ఆరోపణలను తీవ్రంగా ఖండిస్తున్నామన్నారు.
కేంద్ర నిధులతో రాష్ట్ర నిధులు ఉండడం వల్ల అభివృద్ధి జరుగుతున్నాయని, కేంద్రం పెట్టిన పథకాలు ఉపయోగించుకొని అభివృద్ధి జరగాలని కోరుకుంటున్నామని అన్నారు. కాంగ్రెస్ నాయకులు అబద్ధాలు చెబితే నిజాలు కావని నిరూపించాలనుకుంటే మేము కూడా సిద్ధమని అన్నారు. సంజయ్ చొరవ చూపడం వల్లనే కరీంనగర్ అభివృద్ధి చెందుతుందని కేంద్రం నిధులు విడుదల చేస్తుందని వాటిని సద్వినియోగం చేసుకోవాలని సూచించారు.
నగరంలో జరిగిన స్మార్ట్ సిటీ పనులు, యు డి ఎఫ్ నిధులు, ఇతర అభివృద్ధి పనులకు బండి సంజయ్ చొరవతోటే నిధులు విడుదల అయ్యాయని, నగరంలోని డంప్యాడ్ సమస్యను కూడా తొలగిస్తామని తెలిపారు. అభివృద్ధి నిరోధకులు కాంగ్రెస్ పార్టీ వాళ్లేనని నగరంలో ఆర్ఓబి పనులు నిలుపుదలకు కాంగ్రెస్ నాయకుల వల్లనే ఆలస్యం అవుతుందన్నారు. గత ప్రభుత్వంలో అవినీతి జరిగిందని ఆరోపించే నాయకులు ఏ విధంగా జరిగిందో నిరూపించాలని అప్పుడు కూడా బండి సంజయ్ ఎంపీగా ఉండి నగరాన్ని స్మార్ట్ సిటీలో ఎంపిక చేశారని గుర్తు చేశారు.
నగర అభివృద్ధికే కట్టుబడి ఉన్నాం..
నగర అభివృద్ధి తోటే అన్ని సాధ్యమవుతాయని రాష్ట్ర ప్రభుత్వం కేంద్ర ప్రభుత్వానికి చెల్లించాల్సిన నిధులను 16వ గ్రాంట్ ప్రకారం కేంద్రం తిరిగి చెల్లించకుండా సెటిల్మెంట్ చేస్తుందన్నారు. కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన పథకాలను సద్వినియోగం చేసుకొని నిధులను వెచ్చించి అభివృద్ధికి పాటుపడాలని అన్ని పార్టీల రాజకీయ నాయకులకు కోరారు. గతంలో స్మార్ట్ సిటీ, ఇప్పుడు యు డి ఎఫ్ నిధులు, రావడానికి తేవడానికి కారణం బండి సంజయ్ అని, అభివృద్ధి ప్రదాత కాబట్టే మేము ఆయన పేరు చెబుతున్నామని, పథకాలు కేంద్రానికి సంబంధం లేదని నిరూపించగలరా అని ప్రశ్నించారు. ఏది ఏమైనా కరీంనగర్ అభివృద్ధికి అందరం కలిసికట్టుగా పని చేద్దామని కోరారు.




