Karimnagar: కరీంనగర్: గంజాయి కేసు కుట్రలో కానిస్టేబుల్ అరెస్ట్!

Karimnagar: కరీంనగర్‌లో భూ వివాదంలో ప్రత్యర్థిని ఇరికించేందుకు గంజాయి డ్రామా ఆడిన ఈగల్ టీమ్ కానిస్టేబుల్ నాగరాజును కొత్తపల్లి పోలీసులు అరెస్ట్ చేశారు.

SUDHAKAR, KARIMNGAR TOWN
Published on: 1 Aug 2026 10:32 AM IST
Karimnagar
X

Karimnagar: కరీంనగర్: గంజాయి కేసు కుట్రలో కానిస్టేబుల్ అరెస్ట్!

అమాయకుడిపై కుట్ర: గంజాయి కేసులో కానిస్టేబుల్ అరెస్ట్

కరీంనగర్ : సివిల్ తగాదాలో ప్రత్యర్థిని జైలుకు పంపేందుకు పగతో రగిలిపోయిన ఓ పోలీస్ కానిస్టేబుల్ తీరు కరీంనగర్‌లో తీవ్ర కలకలం రేపింది. పోలీసుల కథనం ప్రకారం..ఈగల్ టీమ్‌లో పనిచేస్తున్న కానిస్టేబుల్ మేడబోయిన నాగరాజు, తన మిత్రుడైన తోడేటి శ్రీనివాస్‌కు చెందిన భూ వివాదంలో జోక్యం చేసుకున్నాడు.

ఎలాగైనా ప్రత్యర్థి శ్రీనివాస్‌రెడ్డిని క్రిమినల్ కేసులో ఇరికించాలనే ఉద్దేశంతో వరంగల్ నుంచి గంజాయి తెప్పించి అతడి ఫెర్టిలైజర్ షాపులో పెట్టించాడు. అనంతరం పోలీసులకు సమాచారం అందించి శ్రీనివాస్‌రెడ్డిపై కేసు నమోదయ్యేలా చేశాడు. అయితే తెప్పించిన గంజాయిలో మిగిలిన 370 గ్రాములను నాగరాజు సీతారాంపూర్‌లోని తన ఇంట్లో దాచుకున్నాడు. పక్కా సమాచారంతో కొత్తపల్లి పోలీసులు దాడి చేసి,గంజాయితో పాటు 4 ఫోన్లను స్వాధీనం చేసుకుని కానిస్టేబుల్ నాగరాజును అరెస్ట్ చేసినట్లు ఏసిపి విజయ్ కుమార్ తెలిపారు.

SUDHAKAR, KARIMNGAR TOWN

SUDHAKAR, KARIMNGAR TOWN

Next Story