Karimnagar: కాంగ్రెస్, బీఆర్ఎస్ నేతలకు తెలివి లేదు.. సునీల్ రావు ఘాటు వ్యాఖ్యలు

Karimnagar: కరీంనగర్ అభివృద్ధి కేంద్ర నిధులతోనే సాధ్యమైందని డిప్యూటీ మేయర్ సునీల్ రావు అన్నారు.

హెచ్ఎం డిజిటల్ డెస్క్
Published on: 9 April 2026 4:51 PM IST
Karimnagar
X

Karimnagar: కాంగ్రెస్, బీఆర్ఎస్ నేతలకు తెలివి లేదు.. సునీల్ రావు ఘాటు వ్యాఖ్యలు

కరీంనగర్: బండి సంజయ్ పేరు తరచుకోనిదే కాంగ్రెస్ టిఆర్ఎస్ నాయకులకు ఊట గడవని పరిస్థితి ఏర్పడ్డదని డిప్యూటీ మేయర్ సునీల్ రావు అన్నారు. నేడు మీడియా సమావేశం ఏర్పాటు చేసి మాట్లాడుతూ టిఆర్ఎస్, కాంగ్రెస్ నాయకులు మాట్లాడే మాటలు పొంతన లేని మాటలు గా ఉన్నాయని విమర్శించారు. గత 10 సంవత్సరాల కాలంలో టిఆర్ఎస్ ప్రభుత్వం, 20,30 సంవత్సరాలు కాంగ్రెస్ ప్రభుత్వం నగరపాలక సంస్థలో ఏర్పడ్డ సమస్యలను పరిష్కరించక వదిలేయడంతో నేడు పెద్ద చిక్కుగా మారిందన్నారు. పాలకవర్గం ఏర్పడి రెండు మాసాలు కాకముందే పనులు చేయలేం లేదని విమర్శించే నాయకులకు తెలివి లేదని అన్నారు.

అభివృద్ధి చూసి మాట్లాడండి..

నగరంలో జరుగుతున్న అభివృద్ధి కేంద్ర ప్రభుత్వ నిధులైనని స్మార్ట్ సిటీ నిధులు రైల్వే ఓవర్ బ్రిడ్జి అమృత్సర్ వంటి పథకాలను కేంద్ర ప్రభుత్వ సహాయముతో బండి సంజయ్ కరీంనగర్ కు తీసుకొచ్చారు.

డంప్ యార్డ్ సమస్య కోసం కేంద్రమంత్రి కట్టర్ ను తీసుకువచ్చి సమస్యను వివరించి నిధులు కూడా తీసుకురావడానికి సిద్ధంగా ఉన్నారు.

కలిసి పని చేద్దాం నగర అభివృద్ధికి పాటుపడదాం..

నగరంలో నెలకొన్న అనేక సమస్యలపై కలిసి పనిచేసే అభివృద్ధికి పాటుపడదామని కోరారు. నగరంలో నెలకొన్న డంపింగ్ యార్డు, త్రాగునీటి సమస్య , రోడ్లు డ్రైనేజీ సమస్యలపై చర్చించి ప్రజలకు జవాబు దారి తనంగా సమస్యల పరిష్కారానికి కృషి చేద్దామన్నారు.

ప్రభుత్వ భూములను కాపాడుదాం..

ప్రభుత్వ భూములు కాపాడవలసింది రెవెన్యూ డిపార్ట్మెంట్ అన్నారు. విలీన గ్రామాలు ప్రభుత్వ భూములు ప్రతి రికార్డును రెవెన్యూ డిపార్ట్మెంట్ వద్ద ఉంటుందని అలాంటి భూములు అన్నిక్రాంతమైతే కాపాడాల్సింది కూడా రెవెన్యూ అధికారులు లేనని తెలిపారు. రెవెన్యూ అధికారులు ఒక్క గుంట భూమి కూడా ప్రభుత్వ భూమిని అన్యక్రాంతం కాకుండా కాపాడుతున్నారని ఏదైనా సమస్యలు ఉంటే జిల్లా అధికారులకు ఫిర్యాదు చేయాలని ప్రజలను అధికారులను నాయకులను కోరారు.

నగరపాలక సంస్థలో అవినీతిపై చర్యలు..

కరీంనగర్ నగరపాలక సంస్థలో ఎక్కడ కూడా అవినీతి జరగడంలేదని అలా అని ప్రతి అధికారి నిజాయితీగా పనిచేస్తున్న దానికి ఆధారం లేదని ఎవరైనా తప్పుగా అవినీతికి పాల్పడితే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.

డంపు యార్డు తరలించకుండా రివర్ ఫ్రంట్ పనులు ఎలా..

డంపు యార్డ్ తరలించకుండా మానేరు రివర్ ఫ్రంట్ పనులు జరగవని అన్నారు. నగరంలోని చెత్త గత 15 సంవత్సరాలుగా అక్కడ నిలువ చేయడం వల్ల చుట్టుపక్కల ప్రాంతాలు కలుషితమయ్యాయని తెలిపారు. మానేరు రివర్ ఫ్రంట్ నిర్మిస్తే అక్కడ ఉండే వాతావరణం పొల్యూషన్ ఏర్పడుతుందని అందుకే ముందస్తుగా డంప్యాడ్ను తరలించి మానేరు రివర్ ఫ్రంట్ పనులు చేపట్టాలని కోరారు. మానేరు రివర్ ఫ్రంట్ పనులకు ముందస్తుగా నగరంలోని ప్రధాన మురికినీటి కాలువలు కూడా అందులోనే కలుస్తున్నాయన్నారు. నగరంలోని మురుగునీటి వ్యవస్థను పైప్ లైన్ ద్వారా దూరం తరలించి పనులు చేపట్టాలన్నారు.

నగరవ్యాప్తంగా నెలకొన్న సమస్యలున్న ముందస్తుగా పరిష్కార మార్గాలు అన్వేషించి పరిష్కారం చేసిన తర్వాతే ప్రజలకు జరుగుతుందని ఇది తెలియకుండా నాయకులు అవాకులు చివాకులు మాట్లాడటం మానుకోవాలని హెచ్చరించారు.

హెచ్ఎం డిజిటల్ డెస్క్

హెచ్ఎం డిజిటల్ డెస్క్

Next Story