Karimnagar: కరీంనగర్ డీసీసీలో నూతన నియామకాల జోష్
Karimnagar: కరీంనగర్ జిల్లా కాంగ్రెస్ కమిటీ (DCC) జనరల్ సెక్రటరీగా భాగ్యనగర్‌కు చెందిన సీనియర్ నేత జువ్వాడి అమరేందర్ రావు నియమితులయ్యారు.
Karimnagar: కరీంనగర్ డీసీసీలో నూతన నియామకాల జోష్
కరీంనగర్: కరీంనగర్ జిల్లా కాంగ్రెస్ పార్టీలో నూతన డివిజన్ అధ్యక్షులు, పార్టీ జనరల్ సెక్రెటరీ నియామకాలు పూర్తయ్యాయి. కరీంనగర్ భాగ్యనగర్ నివాసేన జువ్వాడి అమరేందర్ రావు ను నూతనంగా జిల్లా కాంగ్రెస్ కమిటీ జనరల్ సెక్రటరీగా నియమించినట్లు కాంగ్రెస్ జిల్లా అధ్యక్షుడు చొప్పదండి ఎమ్మెల్యే మేడిపల్లి సత్యం నియామక పత్రాన్ని అందించారు.
ఈ సందర్భంగా అమరేందర్ రావు మాట్లాడుతూ గత 40 సంవత్సరాలుగా కాంగ్రెస్ పార్టీలో పని చేస్తున్నందుకు పార్టీ తనను గుర్తించి జనరల్ సెక్రటరీగా పదవి ఇవ్వడం చాలా సంతోషంగా ఉందన్నారు. ఈ పదవి రావడానికి కృషిచేసి నియమించిన తెలంగాణ కాంగ్రెస్ కమిటీ రాష్ట్ర అధ్యక్షులు బొమ్మ మహేష్ కుమార్ గౌడ్, మంత్రి పొన్నం ప్రభాకర్, జిల్లా అధ్యక్షుడు, ఎమ్మెల్యే మేడిపల్లి సత్యం, మాజీ సుడా చైర్మన్ కోమటిరెడ్డి నరేందర్ రెడ్డి లకు కృతజ్ఞతలు తెలిపారు.
గతంలో ధర్మపురి మండల ప్రెసిడెంట్ గా , జిల్లా అధికార ప్రతినిధిగా పనిచేసిన అనుభవం నిండుగా ఉన్నదని, నూతనంగా తనకు అప్పగించిన ఈ పదవికి పూర్తి న్యాయం చేస్తానని తెలిపారు. కాంగ్రెస్ పార్టీని బలోపేతం చేస్తూ, నాయకత్వాన్ని ముందుకు నడిపించే దిశగా పనిచేస్తానని, సంక్షేమ పథకాలపై ప్రజలకు అవగాహన కల్పిస్తూ పార్టీని, పార్టీలో ఉన్న వారిని అందర్నీ కలుపుకొని పనిచేస్తానని అన్నారు. తనకు ఈ పదవి రావడానికి కృషి చేసిన ప్రతి ఒక్కరికి కృతజ్ఞతలు తెలుపుతున్నట్లు చెప్పారు.




