Karimnagar: డంపింగ్ యార్డు తరలించాలి ప్రజావాణిలో సీపీఎం వినతి!
Karimnagar: కరీంనగర్‌లో డంపింగ్ యార్డ్ తరలింపు, రోడ్లు, డ్రైనేజీ సమస్యలు పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ అడిషనల్ కమిషనర్ ఆయాజ్‌కు సీపీఎం వినతిపత్రం సమర్పణ.
Karimnagar: డంపింగ్ యార్డు తరలించాలి ప్రజావాణిలో సీపీఎం వినతి!
Karimnagar: కరీంనగర్ మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలోని ప్రజా సమస్యలు పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ సిపిఎం నగర కమిటీ ఆధ్వర్యంలో ఈరోజు ప్రజావాణి కార్యక్రమంలో అడిషనల్ కమిషనర్ ఆయాజ్ కి వినతి పత్రం ఇవ్వడం జరిగింది.
ఈ సందర్భంగా సిపిఎం నగర కార్యదర్శి గుడికందుల సత్యం మాట్లాడుతూ కరీంనగర్ పట్టణంలో సంవత్సరాల కాలం నుండి డంపింగ్ యార్డ్ వర్షానికి తడుస్తూ దుర్వాసన వెదజల్లుతుందని, ఎండాకాలంలో డంపింగ్ యార్డ్ తగలబడి దట్టమైన పొగ వెదజల్లడం మూలంగా ప్రజలు శ్వాస కోసం బాదిన పడుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు.
అనేకమార్లు సిపిఎం ఆధ్వర్యంలో డంపింగ్ యార్డ్ ను తరలించాలని ఆందోళన పోరాటాలు చేశామని, బిజెపి కి కరీంనగర్ పట్టణంలో మేయర్ పదవి ఇస్తే నెల రోజుల్లో డంపింగ్ యార్డ్ తరలిస్తామని ఎన్నికల ముందు ఇచ్చిన హామీలు నీటి మూటలుగా మిగిలిపోయాయి అని ఆగ్రహం వ్యక్తం చేశారు.
నగరంలోని రోడ్లు డ్రైనేజీ పాడైపోయాయని కొద్దిపాటి వర్షానికి కరీంనగర్ పట్టణం జలమయం అవుతుందని అన్నారు. కొత్త పాలకవర్గం నిధులు కేటాయించి రోడ్లు బాగు చేయాలని డిమాండ్ చేశారు.
మున్సిపల్ నల్ల కనెక్షన్ల ద్వారా నీరు కేవలం 30 నిమిషాలు 40 నిమిషాలు ఇస్తున్నారని అది కూడా రెండు మూడు రోజులకు ఒకసారి వస్తుందని రెగ్యులర్గా వచ్చే విధంగా నగర మేయర్ మున్సిపల్ కమిషనర్ చర్యలు తీసుకోవాలని అన్నారు.
సర్ ఫారంలో అనేక తప్పిదాలు ఉన్నాయని ప్రజలను ఇబ్బంది పెట్టే విధంగా మున్సిపల్ కార్యాలయం చుట్టూ తిప్పుతున్నారని అనేకమంది ప్రజలు రావడం మూలంగా సౌకర్యాలు లేవని అన్నారు.
మున్సిపల్ కార్పొరేషన్ లోని గ్రంథాలయం శిథిలావస్థకు చేరిందని పక్కా భవనం నిర్మించి లైబ్రరీ ఏర్పాటు చేయాలని అన్నారు, కరీంనగర్ పట్టణంలో ప్రజలు ఇల్లు నిర్మించుకునేటప్పుడు చెస్ ద్వారా లైబ్రరీ పన్ను కూడా వసూలు చేస్తున్నారని, ఇప్పటికి కోట్లాది రూపాయలు వసూలైన లైబ్రరీ ఎందుకు నిర్మించడం లేదని ప్రశ్నించారు.
అనంతరం పలు డిమాండ్లతో కూడిన వినతి పత్రాన్ని అడిషనల్ కమిషనర్ ఆయాజ్ కి అందజేశారు.
ఈ కార్యక్రమంలో నగర కమిటీ సభ్యులు వట్టి జగదీష్, నాయకులు రోహిత్, పాతూరి లింగారెడ్డి,గుర్రం రాజేశం తదితరులు పాల్గొన్నారు.




