Karimnagar: కేసీఆర్, కేటీఆర్‌లపై తీవ్రస్థాయిలో ధ్వజమెత్తిన అంజన్ కుమార్

Karimnagar: బీఆర్ఎస్ విడుదల చేసిన ఛార్జ్‌షీట్ అబద్ధాల పుట్ట అని కరీంనగర్ కార్పొరేషన్ కాంగ్రెస్ అధ్యక్షుడు వైద్యుల అంజన్ కుమార్ విమర్శించారు.

SUDHAKAR, KARIMNGAR TOWN
Published on: 3 Sept 2026 10:49 PM IST
Karimnagar
X

Karimnagar: కేసీఆర్, కేటీఆర్‌లపై తీవ్రస్థాయిలో ధ్వజమెత్తిన అంజన్ కుమార్

కరీంనగర్: కరీంనగర్ DCC ఆఫీస్ ఇందిరా భవన్ లో జరిగిన ప్రెస్ మీట్ లో కరీంనగర్ కార్పొరేషన్ అధ్యక్షులు, కార్పొరేటర్ వైద్యుల అంజన్ కుమార్ కేసీఆర్, కేటీఆర్ లపై తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.అది ఛార్జ్‌షీట్ కాదు.. కేసీఆర్ అబద్ధాల షీట్.. కేటీఆర్ అక్కసు ఫీట్ అన్నారు. అది ఛార్జ్‌షీట్ కాదు.. అబద్ధాల పుట్ట, చిల్లరగాళ్లు రాసిన చెత్త. రాష్ట్రానికి పట్టిన గులాబీ చీడ.. తెలంగాణ రాష్ట్రానికి పట్టిన శని, దరిద్రం, నీచం, నికృష్టం అని తీవ్ర స్థాయిలో ద్వజమెత్తారు.

అధికారం పోయి 1000 రోజులు అయిన సందర్భంగా కల్వకుంట్ల కుటుంబ ఆక్రోశం ఇది అన్నారు. తెలంగాణ ప్రజలు గడీలను కూల్చి 1000 రోజులు అయిన సందర్భంగా గులాబీ దొంగల ఆవేశం. ప్రజాస్వామ్యాన్ని పునరుద్ధరించి 1000 రోజులు అయిన సందర్భంగా దొరల ఆక్రందన. తెలంగాణ ప్రజలు స్వేచ్ఛా వాయువులు పీల్చుకుంటుంటే చూసి భరించలేని భావజాలం.

కేటీఆర్.. ఈ ఛార్జ్‌షీట్ ఎవరి మీద..? ప్రజా పాలన అందిస్తున్న రేవంత్ రెడ్డి, కాంగ్రెస్ పార్టీ పైనా..? రుణమాఫీ అయి, రైతు భరోసా అందుకుంటూ సుభిక్షంగా, సంతోషంగా ఉన్న తెలంగాణ రైతన్నలపైనా..? 70 వేల ఉద్యోగాలు అందుకున్న యువతపైనా..?

15 లక్షల కొత్త రేషన్ కార్డులు అందుకుని సన్న బియ్యం తింటున్న మూడున్నర కోట్ల పేదలపైనా..? 200 యూనిట్ల ఉచిత విద్యుత్‌తో తమ ఇళ్లలో కాంతులు తెచ్చుకుంటున్న 52 లక్షల కుటుంబాలపైనా..? ఆర్టీసీలో ఉచిత ప్రయాణంతో సగర్వంగా సాగిపోతున్న తెలంగాణ ఆడబిడ్డలపైనా..?

ఇందిరమ్మ చీరల్లో ఆత్మవిశ్వాసంతో అడుగులు వేస్తున్న అక్కా చెల్లెళ్లపైనా..? 1000 బస్సులకు యజమానులైన సోదరీమణులపైనా..? పెట్రోల్ బంకులతో దూసుకుపోతున్న ఆడబిడ్డలపైనా..? 4.8 లక్షల మంది ఇందిరమ్మ ఇళ్లు కట్టుకున్న పేదలపైనా..? బీసీ కులగణనపైనా..? ఎస్సీ వర్గీకరణపైనా..? *ఎవరి మీద మీ ఛార్జ్‌షీట్..?

ఆస్థాన రచయితలతో చెత్త రాయించుకువచ్చి పిచ్చి వాగుడు వాగితే నమ్మడానికి తెలంగాణ ప్రజలు అమాయకులు కాదు. చెల్లి ప్రశ్నలకు సమాధానం చెప్పలేని చవటలు.ప్రజలు బుద్ధి చెప్పినా సిగ్గు తెచ్చుకోని జీవితాలు.ఎన్నికల్లో సున్నాలు చుట్టినా, డిపాజిట్లు దక్కకపోయినా, ప్రజలు పదే పదే ఛీ కొట్టినా మారని బతుకులు మీవి అన్నారు.

ఫామ్‌హౌస్ దాటని ప్రతిపక్ష నాయకుడు, గెస్ట్‌హౌస్‌లు వదలని పార్టీ నాయకులు. మీది భారత రాష్ట్ర సమితి కాదు.. ఫామ్‌హౌస్ రెస్ట్ సమితి అని పెట్టుకోండి. పదేళ్ల పాటు రాష్ట్రాన్ని మింగేసిన ప్రపంచపు అతిపెద్ద అవినీతి అనకొండలు..

బంగారు తెలంగాణ పేరుతో సర్వం దోచుకుని అవినీతి సామ్రాజ్యాన్ని నిర్మించుకున్న నియంతలు మీరు. తెలంగాణ ప్రజల రక్తమాంసాలను జుర్రుకున్న రాక్షసులు, అసెంబ్లీకి కూడా రావడం చేతకాని సన్నాసులు, మా రేవంత్ రెడ్డికి ఎదురునిలబడి సమాధానం చెప్పలేని ఎబ్రాసీలు అని తీవ్రస్థాయిలో విమర్శించారు.

ఈ పాత్రికేయ సమావేశంలో RGPRS జిల్లా చైర్మన్ మడుపు మోహన్, కరీంనగర్ కార్పొరేషన్ కాంగ్రెస్ కమిటీ ప్రధాన కార్యదర్శులు ఇమ్రాన్, కంకణాల అనిల్, పహాడ్ ఇమ్రాన్ ఘని, శ్రీనివాస్, ఖదీర్, ప్రశాంత్ గౌడ్, పాండుర్ల విజయ్ తదితర కాంగ్రెస్ నాయకులు పాల్గొన్నారు.

SUDHAKAR, KARIMNGAR TOWN

SUDHAKAR, KARIMNGAR TOWN

Next Story