Karimnagar: కాంగ్రెస్ ధర్నా రాహుల్ గాంధీ అరెస్టుపై తీవ్ర ఆగ్రహం!

Karimnagar: నీట్ పేపర్ లీకేజీకి బాధ్యత వహిస్తూ ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేయాలని కరీంనగర్‌లో కాంగ్రెస్ నిరసన. రాహుల్ గాంధీ అక్రమ అరెస్టుపై నేతల మండిపాటు.

SUDHAKAR, KARIMNGAR TOWN
Published on: 23 July 2026 4:27 PM IST
Karimnagar
X

Karimnagar: కాంగ్రెస్ ధర్నా రాహుల్ గాంధీ అరెస్టుపై తీవ్ర ఆగ్రహం!

Karimnagar: నీట్ పేపర్ లీకేజీకి బాధ్యత వహిస్తూ కేంద్ర విద్యా శాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేయాలని పలు డివిజన్లో నిరసన చేపట్టిన కాంగ్రెస్ నాయకులు కార్యకర్తలు. ఈ సందర్భంగా నాయకులు మాట్లాడుతూ ఢిల్లీ లోని జంతర్ మంతర్ వద్ద శాంతియుతంగా నిరసన చేపట్టిన విద్యార్థి యువతపై పోలీసులు లాఠీ చార్జ్ చేయడం అమానుషం అన్నారు.

ఘటన పట్ల స్పందించిన లోక్ సభ ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ ప్రియాంక గాంధీ ప్రతిపక్ష నాయకులు ప్రధాని నరేంద్ర మోదీ నివాసం శాంతియుత నిరసన కార్యక్రమం చేస్తే మోడీ అమిత్ షా రాహుల్ గాంధీ మరియు ప్రతిపక్ష నేతలను అక్రమంగా అరెస్టు చేయడాన్ని ఖండిస్తున్నామన్నారు. ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేయాలని నీట్ పేపర్ లీకేజీ పై లోక్సభలో చర్చ జరగాలనే డిమాండ్ చేశారు.

ఏఐసిసి పిసిసి పిలుపుమేరకు కరీంనగర్ పట్టణంలోని 35 వ డివిజన్ కాంగ్రెస్ అధ్యక్షులు మాదాసు శ్రీనివాస్, 36వ డివిజన్ అధ్యక్షులు దొంతి శిరీష గోపి, 55వ డివిజన్ అధ్యక్షులు మహమ్మద్ ఇర్షద్ అలీ ఆధ్వర్యంలో మారుతి నగర్, కాపువాడ ప్రధాన చౌరస్తా వద్ద కేంద్రంలోని బిజెపి ప్రభుత్వం విద్యార్థి నిరుద్యోగ యువత పట్ల అవలంబిస్తున్న విధానాలను ఎండగడుతూ నిరసన కార్యక్రమం చేపట్టడం జరిగిందని తెలిపారు.

విద్యార్థులు తమను కన్న తల్లిదండ్రుల కలలను నిజం చేయాలని తమ ఉజ్వల భవిష్యత్తు కోసం డాక్టర్లు ఇంజనీర్లు కావాలని నీట్ పరీక్ష రాస్తే కేంద్ర విద్యా శాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ నిర్లక్ష్యం వల్ల నీట్ పేపర్ లీకేజీ కావడంతో ఎంతోమంది విద్యార్థులు రోడ్డున పడ్డారని మండిపడ్డారు. దీనికి బాధ్యత వహిస్తూ ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేయాలని కోరారు.

జంతర్ మంతర్ వద్ద వేలాది మంది యువత నిరసన దీక్ష చేపడితే కేంద్ర హోం మంత్రి అమిత్ షా ఆదేశాలతో విద్యార్థి యువతపై పోలీసులు విద్యార్థులు అమానుషంగా లాఠీ చార్జి చేస్తూ, అమానుషంగా ప్రవర్తించిన తీరును ఖండిస్తూ, ప్రధాని మోడీ నివాసం ముందు బైఠాయించిన లోక్ సభ ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ ఇతర ముఖ్య నేతలు పోలీసులు అరెస్టు చేయడాన్ని ప్రజాస్వామ్యంపై జరిగిన దాడిగా భావిస్తున్నాం అన్నారు. వెంటనే విద్యార్థుల న్యాయమైన డిమాండ్లను పరిష్కరించాలని మోడీ, అమిత్ షా విద్యార్థులకు భేషరతుగా క్షమాపణలు చెప్పాలని, కేంద్ర విద్యా శాఖ మంత్రి పదవికి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేయాలని, లేనిపక్షంలో ఆందోళనలు తీవ్రతరం చేస్తామని విద్యార్థులకు అండగా ఉంటూ పోరాటాలు కొనసాగిస్తామని హెచ్చరించారు.

ఈ కార్యక్రమంలో సీనియర్ కాంగ్రెస్ నాయకులు దిండిగాల మధు, దుగ్గు మహేందర్, ఎండి ఇమ్రాన్, కోల రమేష్, పూదరి రమేష్, శైలజ, స్వాతి, ఇమ్రాన్ గని, కిం ఫహద్, హర్షద్, ఆశిష్, తదితరులు పాల్గొన్నారు.

SUDHAKAR, KARIMNGAR TOWN

SUDHAKAR, KARIMNGAR TOWN

Next Story