Karimnagar: కరీంనగర్‌లో గాంధీ విగ్రహం వద్ద కాంగ్రెస్ శ్రేణుల ఆందోళన!
Karimnagar: ఢిల్లీ ఘటనకు నిరసనగా కరీంనగర్ గాంధీ విగ్రహం వద్ద కాంగ్రెస్ నాయకుల నిరసన.
Karimnagar: కరీంనగర్‌లో గాంధీ విగ్రహం వద్ద కాంగ్రెస్ శ్రేణుల ఆందోళన!
కరీంనగర్: ఢిల్లీలో ఘటనకు నిరసనగా కరీంనగర్లో కాంగ్రెస్ నాయకులు కార్యకర్తలు గాంధీ విగ్రహం వద్ద జీవిత నిరసన కార్యక్రమాన్ని చేపట్టారు. ఈ కార్యక్రమానికి కాంగ్రెస్ జిల్లా అధ్యక్షుడు చొప్పదండి ఎమ్మెల్యే మేడిపల్లి సత్యం, మానకొండూర్ ఎమ్మెల్యే, కవంపల్లి సత్యనారాయణ, మాజీ సూడా చైర్మన్ నరేందర్ రెడ్డి, కరీంనగర్ కార్పొరేషన్ కాంగ్రెస్ కార్పొరేటర్లు, కార్యకర్తలు భారీగా తరలివచ్చి నిరసన కార్యక్రమంలో పాల్గొన్నారు.
ఈ సందర్భంగా మేడిపల్లి సత్యం, కవంపల్లి సత్యనారాయణ మాట్లాడుతూ నీట్ పరీక్ష లీకేజీలపై కేంద్ర ప్రభుత్వం తక్షణమే విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ ను బర్తరప్ చేయాలని డిమాండ్ చేశారు. దేశంలో మత విద్వేషాలు రెచ్చగొడుతూ లబ్ధి పొందాలని చూస్తున్నారని మండిపడ్డారు.
ఢిల్లీలో నిరసన తెలిపే తే వారిపై అమానుషంగా దాడులు, భాష్పా వాయువులు ఉపయోగించి అణచివేయాలని చూసారని అన్నారు. తక్షణమే పరీక్షల లీకేజీ ఘటనకు బాధ్యత వహించి ప్రధాని మోడీ తప్పుకోవాలని లేనియెడల దేశవ్యాప్తంగా నిరసనలు తెలుపుతామన్నారు.




