Karimnagar: కరీంనగర్‌లో కాంగ్రెస్ బీఎల్‌ఏ-2, సూపర్వైజర్ల సమీక్షా సమావేశం!
Karimnagar: కరీంనగర్ నియోజకవర్గంలో నిర్వహించిన బీఎల్‌ఏ-2 (BLA-2), సూపర్వైజర్ల సమావేశంలో టీపీసీసీ ప్రధాన కార్యదర్శి గడ్డం చంద్రశేఖర్ రెడ్డి పాల్గొన్నారు.
Karimnagar: కరీంనగర్‌లో కాంగ్రెస్ బీఎల్‌ఏ-2, సూపర్వైజర్ల సమీక్షా సమావేశం!
కరీంనగర్: కరీంనగర్ అసెంబ్లీ నియోజకవర్గ పరిధిలో బూత్ లెవల్ ఏజెంట్లు (BLA-2) మరియు సూపర్వైజర్ల సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో పార్టీ సంస్థాగత బలోపేతం, బూత్ స్థాయిలో పార్టీ కార్యక్రమాల నిర్వహణ, ఓటర్లతో నిరంతరం సంబంధాలు కొనసాగించడం తదితర అంశాలపై చర్చించారు.
ఈ సందర్భంగా టీపీసీసీ ప్రధాన కార్యదర్శి గడ్డం చంద్రశేఖర్ రెడ్డి మాట్లాడుతూ, బూత్ స్థాయిలో పార్టీని మరింత పటిష్టంగా నిర్మించడంలో BLA-2లు, సూపర్వైజర్లు కీలక పాత్ర పోషించాలని అన్నారు. ప్రతి బూత్ పరిధిలోని ఓటర్ల సమస్యలను తెలుసుకుని, వాటిని పార్టీ నాయకత్వం దృష్టికి తీసుకువచ్చి పరిష్కారానికి కృషి చేయాలని సూచించారు.
కాంగ్రెస్ ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ, అభివృద్ధి కార్యక్రమాలను ప్రజల్లోకి విస్తృతంగా తీసుకెళ్లాలని, ప్రభుత్వ పథకాల ద్వారా ప్రజలకు అందుతున్న ప్రయోజనాలను వివరించాలని ఆయన అన్నారు. రాబోయే రోజుల్లో పార్టీ కార్యక్రమాలను సమన్వయంతో నిర్వహిస్తూ, ప్రతి బూత్‌లో కాంగ్రెస్ పార్టీని మరింత బలోపేతం చేయాలని పిలుపునిచ్చారు.
ఈ సమావేశంలో, కార్పొరేషన్ డిసిసి అధ్యక్షులు, వైద్యుల అంజన్ కుమార్, మున్సిపల్ కార్పొరేటర్లు, ఈ.ర్.ఓ మోహన్, మహిళ అధ్యక్షులు,BLA -2లు, సూపర్వైజర్లు, పార్టీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.




