Karimnagar: బిజెపి ఎంపీ కార్యాలయం వద్ద ఘర్షణ!
Karimnagar: కరీంనగర్ బిజెపి ఎంపీ కార్యాలయం వద్ద కాంగ్రెస్, బిజెపి కార్యకర్తల దాడులు. కోడిగుడ్లు, టమాటాలతో పరస్పర దాడి.. రంగంలోకి దిగి అరెస్టు చేసిన పోలీసులు.
Karimnagar: బిజెపి ఎంపీ కార్యాలయం వద్ద ఘర్షణ!
Karimnagar: శాంతియుతంగా గాంధీ విగ్రహం వద్ద నిరసన తెలుపుతున్న కాంగ్రెస్ కార్యకర్తలు నాయకులు అంబేద్కర్ విగ్రహం వద్దకు ర్యాలీ నిర్వహించారు. అనంతరం కాంగ్రెస్ కార్యకర్తలు నాయకులు ఒక్కసారిగా బిజెపి ఎంపీ కార్యాలయం వద్దకు చేరుకున్నారు. బిజెపి పార్లమెంట్ కార్యాలయం ముందు నిరసనకు దిగడంతో కార్యాలయంలో ఉన్న బిజెపి కార్యకర్తలు వీరితో ఘర్షణ వెతికి ఒకరికొకరు దాడులు చేసుకున్నారు. కోడిగుడ్లు టమాటాలు చెప్పులు కట్టలతో దాడులు చేసుకున్నా కాంగ్రెస్ బిజెపి కార్యకర్తలను పోలీసులు అడ్డుకొని కాంగ్రెస్ నాయకులను కార్యకర్తలను అరెస్టు చేసి స్టేషన్కు తరలించారు.
బిజెపి పార్లమెంట్ కార్యాలయం వద్ద ఘర్షణ వాతావరణం...
ఒక్కసారిగా కాంగ్రెస్ కార్యకర్తలు బిజెపి పార్లమెంటు కార్యాలయం మీదకు చేరుకోవడంతో అక్కడే ఉన్న బిజెపి కార్యకర్తలు పరస్పరము దూషించుకుని దాడులకు దిగారు. అందుబాటులో ఉన్న వస్తువులతో దాడులు చేసుకున్నారు. ఈ దాడుల్లో పలువురు కాంగ్రెస్ కార్యకర్తలకు గాయాలయ్యాయి. ఒకసారి రా ఘర్షణ వాతావరణం నెలకొనడంతో పోలీసులు ఇరు వర్గాలను శాంతింప చేయడానికి సమయం పట్టింది. అక్కడికి వచ్చిన కాంగ్రెస్ కార్యకర్తలను పోలీసులు బలవంతంగా అరెస్టు చేసి తరలించారు.




