Karimnagar: కరీంనగర్ పారదర్శకంగా ఇళ్ల లబ్ధిదారుల ఎంపిక
Karimnagar: కరీంనగర్‌లో డబుల్ బెడ్ రూం, ఇందిరమ్మ ఇళ్ల లబ్ధిదారుల ఎంపిక పారదర్శకంగా జరగాలని కమీషనర్ ప్రఫుల్ దేశాయ్ ఆదేశం. హౌసింగ్, టౌన్ ప్లానింగ్ అధికారులతో సమీక్ష.
Karimnagar: కరీంనగర్ పారదర్శకంగా ఇళ్ల లబ్ధిదారుల ఎంపిక
కరీంనగర్: ప్రభుత్వ మార్గదర్శకాలు, నియమ నిబంధనల ప్రకారమే లబ్ధిదారులను ఎంపిక చేయాలని కమీషనర్ ప్రఫుల్ దేశాయ్ అధికారులను ఆదేశించారు. కరీంనగర్ నగరపాలక సంస్థ కార్యాలయంలో కమీషనర్ ప్రఫుల్ దేశాయ్ నగరపాలక సంస్థ ఇంజనీరింగ్, టౌన్ ప్లానింగ్, మరియు హౌజింగ్ శాఖల అధికారులతో సమీక్షా సమావేశం నిర్వహించారు. నగర పరిధిలో దీర్ఘకాలంగా పెండింగ్‌లో ఉన్న డబుల్ బెడ్ రూం ఇండ్ల కేటాయింపు, మొదటి విడత ఇందిరమ్మ ఇండ్లు, రెండో విడుత ఇందిరమ్మ ఇండ్ల మంజూరు, ప్రజావాణీ పెండింగ్ దరఖాస్తులు తదితర అంశాలపై అధికారులతో సుదీర్ఘంగా చర్చించారు. అధికారులకు పలు సూచనలు ఆదేశాలు జారీ చేశారు.
ఈ సంధర్బంగా కమీషనర్ ప్రఫుల్ దేశాయ్ మాట్లాడుతూ ప్రభుత్వ నిమయ నిబంధనల ప్రకారం డబుల్ బెడ్ రూం ఇండ్ల లబ్ధిదారుల ఎంపిక పారదర్శకంగా జరగాలన్నారు. ప్రభుత్వ మార్గదర్శకాలను అనుసరించి గతంలో వచ్చిన దరఖాస్తుల ప్రకారం క్షేత్ర స్థాయిలో తనిఖీ (ఎంక్వైరీ) చేసి అర్హులైన లబ్ధిదారులుగా ఎంపిక చేయాలన్నారు. ప్రధానంగా ఎంపిక ప్రక్రియలో ఎలాంటి పైరవీలకు తావు లేకుండ ఎలాంటి లోపాలు, పొరపాట్లు చేయకుండా పారదర్శకంగా లబ్ధిదారులను ఎంపిక చేయాలని ఆదేశించారు.
ఈ ప్రక్రియలో ప్రభుత్వ నియమ నిబంధనలను కచ్చితంగా పాటించాలని అధికారులను ఆదేశించారు. ప్రధానంగా వికలాంగులు, వితంతువులు, ఒంటరి మహిళలకు ప్రాధాన్యత కల్పించాలని సూచించారు. మొదటి విడత ఇందిరమ్మ ఇండ్లలో లబ్ధిదారులుగా ఎంపికై ఇప్పటి వరకు ఇండ్లు నిర్మాణం చేయని వారికి నోటీసులు జారీ చేసి...స్పందించని లబ్ధిదారులను తొలగించాలన్నారు. మొదటి విడత మిగిలిన ఇందిరమ్మ ఇండ్లకు ఫీల్డ్ లెవల్ లో ఎంక్వైరీ చేసి అర్హులైన లబ్ధిదారులను ఎంపిక చేసి రిపోర్టు అందించాలన్నారు.
అంతేకాకుండా రెండో విడుత ఇందిరమ్మ ఇండ్ల కు సంబంధించి ప్రభుత్వం ఇచ్చిన గైడ్ లైన్స్ ప్రకారం క్షేత్ర స్థాయిలో తనిఖీ చేపట్టి అర్హులను గుర్తించే ప్రక్రియను ప్రారంభించాలన్నారు. ప్రజావాణి దరఖాస్తులను పెండింగ్ లేకుండా పరిష్కరించాలన్నారు. సెక్షన్ల వారిగా ప్రజల నుండి వచ్చిన ఆర్జీలను పరిశీలించి త్వరగా పరిష్కరించాలని ఆదేశించారు. అధికారులు సమన్వయంతో పని చేయాలని...సమస్యలు ఉంటే వెంటనే తన దృష్టికి తీసుకురావాలని సూచించారు.
ప్రభుత్వ పథకాల ఫలాలు నిజమైన పేదలకు అందేలా అధికారులు బాధ్యతాయుతంగా పని చేయాలన్నారు. నిబంధనల ఉల్లంఘనకు తావులేకుండా పారదర్శకతను పాటించాలని ఆదేశించారు.ఈ సమావేశంలో నగరపాలక సంస్థ అదనపు కమీషనర్ ఆయాజ్, డిప్యూటీ కమీషనర్లు ఖాధర్ మొహియుద్దీన్, వేణు మాధవ్, డీఈలు వెంకటేశ్వర్లు, దేవేంధర్ రెడ్డి, శ్రీనివాస్, డీసిపి బషీరొద్దిన్, ఏసిపిలు శ్రీధర్, వేణు, ఏఈ సతీష్, భీంవర్ధన్ రెడ్డి, నర్మధ, సూపరింటెండెంట్ విజయలక్ష్మీ, సెక్షన్ క్లర్క్ పద్మా తదితరులు పాల్గొన్నారు.




