Karimnagar: పంచాయతీ భవన నిర్మాణాలు తక్షణమే ప్రారంభించాలి!

Karimnagar: మంజూరైన పంచాయతీ భవన నిర్మాణాలను వెంటనే ప్రారంభించాలని, సీజనల్ వ్యాధులపై అప్రమత్తంగా ఉండాలని జిల్లా కలెక్టర్ చిత్రా మిశ్రా అధికారులను ఆదేశించారు.

SUDHAKAR, KARIMNGAR TOWN
Published on: 7 Aug 2026 9:50 AM IST
Karimnagar
X

Karimnagar: పంచాయతీ భవన నిర్మాణాలు తక్షణమే ప్రారంభించాలి!

Karimnagar: మంజూరైన పంచాయతీ భవన నిర్మాణాలు వెంటనే ప్రారంభించాలని జిల్లా కలెక్టర్ చిత్రా మిశ్రా అధికారులను ఆదేశించారు.

జిల్లా పంచాయతీ శాఖ సమీక్ష సమావేశం కలెక్టరేట్ కాన్ఫరెన్స్ హాల్లో జరిగింది.

ఈ సమావేశంలో కలెక్టర్ మాట్లాడుతూ స్థలం గుర్తించి నిర్మాణానికి ఉత్తర్వులు మంజూరైన పంచాయతీ భవనాల నిర్మాణాన్ని వెంటనే ప్రారంభించాలని అన్నారు. నిర్మాణ దశలో ఉన్న భవనాల పనులను వేగవంతం చేయాలన్నారు.

ఎల్ ఆర్ ఎస్ పెండింగ్ దరఖాస్తులను రెవెన్యూ, పంచాయతీ, ఇరిగేషన్ శాఖలు సమన్వయంతో పరిష్కరించాలని అన్నారు. గ్రామాల్లో సీజనల్ వ్యాధులు ప్రబలకుండా చర్యలు తీసుకోవాలన్నారు. మరణించిన మల్టీపర్పస్ కార్మికుల కుటుంబాలకు రావలసిన అన్ని ప్రయోజనాలు త్వరితగతిన అందేలా చూడాలని తెలిపారు.

కార్మికులకు అన్ని రకాల బీమా ప్రీమియాలు చెల్లించాలని సూచించారు. గ్రామ పంచాయతీలకు సంబంధించి పెండింగ్ లో ఉన్న విద్యుత్ బిల్లులలో 49 శాతం పంచాయతీల నుండి చెల్లించడం అభినందనీయమని అన్నారు. ఎంపీఓలు గ్రామాల్లో విస్తృతంగా పర్యటిస్తూ పెండింగ్ పనులను పర్యవేక్షించాలని అన్నారు. గ్రామాల అభివృద్ధికి అవసరమైన పనులకు సంబంధించిన నివేదికలు ఎప్పటికప్పుడు సమర్పించాలని ఆదేశించారు.

సమావేశంలో అడిషనల్ కలెక్టర్ అశ్విని తానాజీ వాకడే, జిల్లా పంచాయతీ అధికారి జగదీశ్వర్, డి ఎల్ పి ఓ లు, ఎంపీఓలు పాల్గొన్నారు.

SUDHAKAR, KARIMNGAR TOWN

SUDHAKAR, KARIMNGAR TOWN

Next Story