Karimnagar: రెసిడెన్షియల్ డిగ్రీ కాలేజ్ ను అత్యుత్తమంగా తీర్చిదిద్దాలి.. జిల్లా కలెక్టర్ చిత్రా మిశ్రా

Karimnagar: నగునూరు తెలంగాణ సోషల్ వెల్ఫేర్ మహిళా డిగ్రీ కాలేజీలో అడ్మిషన్ల పోస్టర్‌ను ఆవిష్కరించిన కలెక్టర్ చిత్రా మిశ్రా. నాణ్యమైన విద్య, వసతులతో కాలేజీని రాష్ట్రంలోనే అత్యుత్తమంగా తీర్చిదిద్దాలని సూచన.

SUDHAKAR, KARIMNGAR TOWN
Published on: 23 April 2026 8:53 AM IST
Karimnagar
X

Karimnagar: రెసిడెన్షియల్ డిగ్రీ కాలేజ్ ను అత్యుత్తమంగా తీర్చిదిద్దాలి.. జిల్లా కలెక్టర్ చిత్రా మిశ్రా

కరీంనగర్: నగునూరు లోని తెలంగాణ సోషల్ వెల్ఫేర్ రెసిడెన్షియల్ మహిళా డిగ్రీ కాలేజ్‌లో ఈ విద్యా సంవత్సరంలో అడ్మిషన్లు మరింత పెంచేందుకు ప్రత్యేకంగా కృషి చేయాలని జిల్లా కలెక్టర్ చిత్రా మిశ్రా సూచించారు. విద్యార్థులకు ఉత్తమ విద్య, సదుపాయాలు అందిస్తూ కాలేజీని అత్యుత్తమ స్థాయికి తీసుకెళ్లాలని పేర్కొన్నారు.

కలెక్టర్ తన ఛాంబర్‌లో కాలేజీ అడ్మిషన్లకు సంబంధించిన పోస్టర్‌ను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా కాలేజీలో ఉన్న కోర్సులు, విద్యార్థుల సంఖ్య, వసతుల కల్పన తదితర వివరాలను ప్రిన్సిపాల్‌ను అడిగి తెలుసుకున్నారు.ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ, సోషల్ వెల్ఫేర్ రెసిడెన్షియల్ డిగ్రీ కాలేజ్‌లు విద్యార్థుల ఉజ్వల భవిష్యత్తుకు బాటలు వేస్తాయని, విద్యార్థులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. నాణ్యమైన విద్యతో పాటు అన్ని సౌకర్యాలు కల్పించి కాలేజీని అత్యుత్తమంగా నిలబెట్టాలన్నారు. ఈ కార్యక్రమంలో కాలేజీ ప్రిన్సిపాల్ మాలతి, వైస్ ప్రిన్సిపాల్ పద్మజ, సూపరిండెంట్ సురేష్ కుమార్ తదితరులు పాల్గొన్నారు.

SUDHAKAR, KARIMNGAR TOWN

SUDHAKAR, KARIMNGAR TOWN

Next Story