Karimnagar: కరీంనగర్‌లో ఈవీఎం గోదాం తనిఖీ చేసిన కలెక్టర్ చిత్రా మిశ్రా!
Karimnagar: కరీంనగర్ కలెక్టరేట్ సమీపంలోని ఈవీఎం గోదామును కలెక్టర్ చిత్రా మిశ్రా, అదనపు కలెక్టర్ శ్రీనివాసరెడ్డి రాజకీయ పార్టీల ప్రతినిధులతో కలిసి ఆకస్మికంగా తనిఖీ చేశారు.
Karimnagar: కరీంనగర్‌లో ఈవీఎం గోదాం తనిఖీ చేసిన కలెక్టర్ చిత్రా మిశ్రా!
కరీంనగర్: జిల్లాకేంద్రంలో కలెక్టరేట్ సమీపంలో ఉన్న ఈవీఎం గోదామును మంగళవారం కలెక్టర్ చిత్రా మిశ్రా, అదనపు కలెక్టర్ శ్రీనివాసరెడ్డి (రెవెన్యూ).. వివిధ రాజకీయ పార్టీల ప్రతినిధులతో కలిసి తనిఖీ చేశారు. ఈవీఎం, వీవీ ప్యాట్లు పరిశీలించారు. ఈ సందర్భంగా గోదాం వద్ద సీసీ కెమెరాల పనితీరు, సిబ్బంది హాజరు, ఫైర్ సేఫ్టీ తదితర వివరాలు తెలుసుకున్నారు.
ఎన్నికల సంఘం ఆదేశాల మేరకు ఈవీఎం, వీవీ ప్యాట్ల గోదాం తనిఖీ చేస్తున్నట్లు పేర్కొన్నారు. అప్రమత్తంగా ఉంటూ విధులు నిర్వర్తించాలని కలెక్టర్.. సిబ్బందిని ఆదేశించారు. కార్యక్రమంలో రాజకీయ పార్టీల ప్రతినిధులు మడుపు మోహన్ , నాంపల్లి శ్రీనివాస్ , సయ్యద్ ఇబ్రహీం , సిరిసిల్ల అంజయ్య తదితరులు పాల్గొన్నారు.
Next Story




