Karimnagar: గ్రామపంచాయతీ కార్మికుల జీతాలు పెంచాలి

Karimnagar: కరీంనగర్ జిల్లా మడిపల్లిలో జరిగిన గ్రామపంచాయతీ కార్మికుల సమావేశంలో సిఐటియు జిల్లా సహాయ కార్యదర్శి కొప్పుల శంకర్ మాట్లాడారు.

GANESH, JAMMIKUNTA
Published on: 16 May 2026 12:34 PM IST
Karimnagar
X

Karimnagar: గ్రామపంచాయతీ కార్మికుల జీతాలు పెంచాలి

కరీంనగర్ జిల్లా: గ్రామపంచాయతీ కార్మికుల గ్రామ కమిటీ సమావేశం అంబాల సదయ్య అధ్యక్షతన మడిపల్లి గ్రామంలో నిర్వహించిన అనంతరం తెలియజేస్తూ కొప్పుల శంకర్ మాట్లాడుతూ, క్షేత్రస్థాయిలో గ్రామాలను శుభ్రం చేస్తున్న పంచాయతీ కార్మికులకు గత 8 సంవత్సరాలుగా ఒకే జీతంపై ప్రభుత్వాలు పని చేయించుకుంటూ శ్రమదోపిడి గురిచేస్తున్నాయని, 2018లో సమ్మె చేసి సాధించుకున్న జీవో నెంబర్ 51 ద్వారా 8500 వేతనం ప్రభుత్వం అమలు చేస్తుందని ఇప్పటికి 8 సంవత్సరాలు కావస్తుందని, ఎనిమిది సంవత్సరాల కాలంలో కుటుంబ అవసరాలు, నిత్యవసర వస్తువుల ధరలు విపరీతంగా పెరిగిపోయాయని, వాటికి అనుగుణంగా పంచాయతీ కార్మికుల జీతాలు పెంచకపోవడం ప్రభుత్వాలు శ్రమ దోపిడీ చేస్తున్నట్లేనని ఆరోపించారు.

2023లో 33 రోజులపాటు సమ్మె సందర్భంగా, కాంగ్రెస్ నాయకులు మేము అధికారంలోకి వస్తే పంచాయతీ కార్మికులకు కనీస వేతనాలు అమలు చేస్తూ, ఉద్యోగ భద్రత కల్పిస్తామని సమ్మె టెన్ట్ శిబిరాల వద్దకు వచ్చి హామీలు ఇచ్చారని అదే విధంగా ప్రభుత్వం తన ఎన్నికల మేనిఫెస్టోలో కూడా పొందపరచిందని, కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చి రెండున్నర సంవత్సరాలు గడుస్తున్నా కార్మికులకు వేతనాలు పెంచుట సంఘటన ఉంచితే, ఇచ్చే వేతనం కూడా ప్రతి నెల ఇవ్వకుండా రెండు నెలలకు ఒకసారి,మూడు నెలలకు ఒకసారి చెల్లిస్తుందని, దీని వలన కార్మికులు మానసికంగా ఆర్థికంగా, ఇప్పటికైనా ప్రభుత్వం స్పందించి ప్రతినెల ప్రభుత్వమే ప్రత్యేక గ్రాండ్ ద్వారా కార్మికుల అకౌంట్లో పదో తేదీలకు వేతనాలు చెల్లించాలని, మల్టీ పర్పస్ వర్కర్ విధానం రద్దు చేయాలని, అలాగే కార్మికులందరి రెండో పి ఆర్ సి ప్రజలకు తీసుకొచ్చి 60 నెంబర్ జీవో ప్రకారం, స్థానిక సంస్థల నుండి మున్సిపల్ లో చెల్లిస్తున్నటువంటి బేసిక్ వేతనం 16500 చెల్లించాలని, డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలొ యూనియన్ మండల అధ్యక్షుడు ఎండిగా రవీందర్రావు, మ్యాకమల్ల రాము, అప్పల ప్రవీణ్, మోహన్, లింగమూర్తి తదితరులు పాల్గొన్నారు.

GANESH, JAMMIKUNTA

GANESH, JAMMIKUNTA

Next Story