Karimnagar: కరీంనగర్‌లో సిద్ధమైన సెంట్రలైజ్డ్ కమ్యూనిటీ కిచెన్!

Karimnagar: కరీంనగర్‌లో సెంట్రలైజ్డ్ కమ్యూనిటీ కిచెన్ ప్రారంభం. 17 మండలాల్లోని 49 వేల మంది ప్రభుత్వ పాఠశాల విద్యార్థులకు రోజూ రుచికరమైన, పోషకాహార అల్పాహారం.

CH Gopalakrishna, Regional Coordinator -Karimnagar
Published on: 15 Sept 2026 3:20 PM IST
Karimnagar
X

Karimnagar: కరీంనగర్‌లో సిద్ధమైన సెంట్రలైజ్డ్ కమ్యూనిటీ కిచెన్!

Karimnagar: కరీంనగర్ పిల్లలు ఆరోగ్యంగా ఉంటేనే చదువుపై పూర్తి స్థాయిలో దృష్టి పెట్టగలరు అందుకే ప్రభుత్వ పాఠశాల విద్యార్థులకు నాణ్యమైన, పోషక విలువలతో కూడిన అల్పాహారం అందించడంపై ప్రభుత్వం ప్రత్యేక దృష్టి పెట్టింది. ఇందులో భాగంగా కరీంనగర్‌లో సెంట్రలైజ్డ్ కమ్యూనిటీ కిచెన్ సిద్ధమైంది. బుధవారం ప్రారంభం కానున్న ఈ కిచెన్ ద్వారా దాదాపు 49 వేల మంది విద్యార్థులకు ప్రతిరోజూ పరిశుభ్రమైన, పోషకాహారంతో కూడిన అల్పాహారం అందించనున్నారు.. మరి ఈ కిచెన్ స్పెషాలిటీ ఏంటి ఎలాంటి ఆహారం విద్యార్థులకి అందుతుంది లెట్స్ వాచ్ దిస్ స్టోరీ.

కరీంనగర్ మార్కెట్ యార్డులో ఏర్పాటు చేసిన ఈ సెంట్రలైజ్డ్ కమ్యూనిటీ కిచెన్.. పెద్ద సంఖ్యలో విద్యార్థులకు ఒకేసారి నాణ్యమైన అల్పాహారం అందించేలా సిద్ధమైంది. కరీంనగర్, హుస్నాబాద్, చొప్పదండి, మానకొండూర్ తదితర నియోజకవర్గాల్లోని దాదాపు 17 మండలాల పరిధిలో 669 ప్రభుత్వ పాఠశాలలు, 11 ప్రభుత్వ జూనియర్ కళాశాలల్లో చదువుతున్న 49,025 మంది విద్యార్థులకు ఇక్కడి నుంచే అల్పాహారం అందనుంది.ఆహార నాణ్యత, పరిశుభ్రతకు ప్రత్యేక ప్రాధాన్యత ఇస్తూ.. విద్యార్థులకు సమతుల్యమైన పోషకాహారం అందేలా ఏర్పాట్లు చేశారు. నేషనల్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ న్యూట్రిషన్ (NIN )సహకారంతో మెనూను రూపొందించారు ఈ భారీ కిచెన్ బుధవారం ప్రారంభం కానుంది.

ఈ కిచెన్ నుండి విద్యార్థులకి నాణ్యత మాత్రమే కాదు ..పౌష్టిక ఆహారాన్ని అందించడమే లక్ష్యంగా ప్రభుత్వం ఏర్పాటు చేసింది ..ప్రతిరోజూ ఒకే రకమైన అల్పాహారం కాకుండా.. వారంలో ఒక్కో రోజు ఒక్కో ప్రత్యేకమైన మెనూను విద్యార్థులకు అందించనున్నారు.సోమవారం ఇడ్లీ–సాంబార్..మంగళవారం పూరి–ఆలు కుర్మా..బుధవారం దోశ–చట్నీ గురువారం ఉప్మా–చట్నీ..శుక్రవారం మిల్లెట్ ఇడ్లీ–సాంబార్..శనివారం బోండా–చట్నీ.

ఇలా రకరకాల వంటకాలతో రుచికరమైన ఆహారం పిల్లలకి అందుతాయి .ఇక విద్యార్థులకు రోజు విడిచి రోజు పాలను కూడా అందించనున్నారు. అంటే రుచికి ప్రాధాన్యత ఇస్తూనే.. పిల్లలకు అవసరమైన పోషక విలువలు అందేలా మెనూను రూపొందించారు.

పెద్ద సంఖ్యలో విద్యార్థులకు ఆహారం అందించాల్సి ఉండటంతో వంట, ప్యాకింగ్, సరఫరా ప్రక్రియలను సమర్థవంతంగా నిర్వహించేలా ఈ సెంట్రలైజ్డ్ కిచెన్‌ను ఏర్పాటు చేశారు. హరే కృష్ణ మూవ్‌మెంట్ చారిటబుల్ ఫౌండేషన్ ఇండియా ఈ కార్యక్రమానికి ఆపరేషనల్ పాట్నర్ గా వ్యవహరిస్తుంది ఇప్పటికే రాష్ట్రంలోని పలు ప్రాంతాల్లో అమలవుతున్న ఈ స్కూల్ బ్రేక్‌ఫాస్ట్ కార్యక్రమానికి మంచి స్పందన రావడం తో రాష్ట్ర వ్యాప్తంగా విస్తరిస్తోంది ప్రభుత్వం.

మొదట సీఎం రేవంత్ రెడ్డి నియోజవర్గం కొడంగల్‌లో ప్రారంభమైన ఈ కార్యక్రమం.. మధిర, మంథని, మంచిర్యాల వంటి ప్రాంతాలకు విస్తరించింది. మంథనిలో 40 వేల మందికి పైగా విద్యార్థులకు, మంచిర్యాలలో సుమారు 50 వేల మంది విద్యార్థులకు అల్పాహారం అందించేలా సెంట్రలైజ్డ్ కిచెన్లు ఏర్పాటు చేశారు. ఆధునిక వంట సదుపాయాలతో అక్కడ విద్యార్థులకు వేడి, తాజా, పరిశుభ్రమైన అల్పాహారం అందిస్తున్నారు. ఇప్పుడు కరీంనగర్‌లో ఏర్పాటు చేసిన కిచెన్ రాష్ట్రంలో ఆరో సెంట్రలైజ్డ్ కమ్యూనిటీ కిచెన్‌గా నిలవనుంది. ఇక్కడి నుంచి ప్రతిరోజూ దాదాపు 49 వేల మంది విద్యార్థులకు రుచికరమైన, పరిశుభ్రమైన, పోషక విలువలతో కూడిన అల్పాహారం అందనుంది.

CH Gopalakrishna, Regional Coordinator -Karimnagar

CH Gopalakrishna, Regional Coordinator -Karimnagar

మూడు దశాబ్దాల సుదీర్ఘ అనుభవంతో, కరీంనగర్ ఉమ్మడి జిల్లా రాజకీయ, సామాజిక పరిణామాలపై అపారమైన పట్టున్న సీనియర్ పాత్రికేయులు మరియు ‘రీజినల్ కోఆర్డినేటర్’.