Karimnagar: కలెక్టరేట్ ఎదుట ఆశా, మధ్యాహ్న భోజన కార్మికుల ధర్నా

Karimnagar: కరీంనగర్‌లో బీఆర్టీయూ ఆధ్వర్యంలో ఆశా వర్కర్లు, మధ్యాహ్న భోజన కార్మికులు కలెక్టరేట్ ఎదుట ధర్నా నిర్వహించి తమ డిమాండ్లను ప్రభుత్వానికి వినిపించారు.

SUDHAKAR, KARIMNGAR TOWN
Published on: 2 Sept 2026 6:26 PM IST
Karimnagar
X

Karimnagar: కలెక్టరేట్ ఎదుట ఆశా, మధ్యాహ్న భోజన కార్మికుల ధర్నా

కరీంనగర్: కరీంనగర్ జిల్లా బి.ఆర్.టి.యు ఆధ్వర్యంలో ఆశా వర్కర్లు ప్రభుత్వ పాఠశాలల మధ్యాహ్న భోజన వంట కార్మికులు కలెక్టరు ఆఫీస్ వద్ద ధర్నా కార్యక్రమం నిర్వహించారు. ఆశా వర్కర్లకు కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన వెంటనే 18,000 ఫిక్స్డ్ వేతనం ఇస్తామని మేనిఫెస్టోలో పెట్టి ఇప్పటివరకు అమలు చేయడం లేదని అలాగే ఉద్యోగ భద్రత కల్పిస్తామని చెప్పి వాటిని అమలు చేయడం లేదని ఇబ్బంది పడ్డారు.

అదేవిధంగా ఏ ఎన్ సీ టార్గెట్ ఎత్తివేయాలని బిఎల్ఓ డ్యూటీ లో నుండి ఆశలను వెంటనే మినహించాలని డిమాండ్ చేసారు. ప్రభుత్వ పాఠశాలలో వంట కార్మికులుగా పనిచేసే కార్మికులు వారికి నెలకు పదివేల ఫిక్స్డ్ వేతనం ఇస్తామని మేనిఫెస్టోలో పెట్టి వాటిని అమలు పరచడం లేదని ఇప్పుడు కొత్తగా మధ్యాహ్న వంట కార్మికులను తీసివేసి హరే రామ హరే కృష్ణ ఇస్కాన్ కు అప్ప చెప్తామని మరియు రాజకీయ నాయకుల ఒత్తిడి వలన 25 సంవత్సరాల నుండి పనిచేస్తున్న కార్మికులను తొలగించి కాంగ్రెస్ పార్టీ రాజకీయ నాయకులు కార్మికుల జీవితాలతో ఆటలాడుకుంటున్నారని మరియు మధ్యాహ్న భోజన కార్మికులకు ప్రభుత్వమే ఐడి కార్డులు ఇవ్వాలని డిమాండ్ చేసినారు ఈ కార్యక్రమం బి ఆర్ టి యు కరీంనగర్ జిల్లా అధ్యక్షులు బొమ్మిడి శ్రీనివాస్ రెడ్డి గారి ఆధ్వర్యంలో నిర్వహించడం జరిగినది.

ఈ కార్యక్రమానికి హమాలీ సంఘం రాష్ట్ర అధ్యక్షులు కొమురె రాఘవులు భవన నిర్మాణ సంఘం జిల్లా అధ్యక్షులు ఆకుల మల్లేశం మరియు ఆశ వర్కర్ల జిల్లా అధ్యక్షురాలు ఎండి రబియాబేగం నాంపల్లి సుమలత మాచర్ల విజయ జేరిపోతుల లలిత శనిగరపు సులోచన దూడపాక వేస్తారా

మధ్యాహ్న భోజనం వంట కార్మికుల సంఘం జిల్లా అధ్యక్షురాలు బుర్ర మంజుల రాష్ట్ర కార్యదర్శి దాసరి బాబాయ్ అమ్మ ప్రధాన కార్యదర్శి ఈ స్వరూప ఏ లక్ష్మి సరోజన ఘట్టవా నజియా మరియు ఆశా వర్కర్లు 100 మంది మధ్యాహ్న భోజన వంట కార్మికులు 50 మంది పాల్గొన్నారు.

SUDHAKAR, KARIMNGAR TOWN

SUDHAKAR, KARIMNGAR TOWN

Next Story