Karimnagar: కరీంనగర్‌లో ఘనంగా శ్యామా ప్రసాద్ ముఖర్జీ ‘బలిదాన్ దివస్’

Karimnagar: కరీంనగర్ పార్లమెంటు కార్యాలయంలో డాక్టర్ శ్యామా ప్రసాద్ ముఖర్జీ వర్ధంతి (బలిదాన్ దివస్) వేడుకలు ఘనంగా జరిగాయి.

G. SUDHAKAR, KARIMNAGAR
Published on: 23 Jun 2026 6:32 PM IST
Karimnagar
X

Karimnagar: కరీంనగర్‌లో ఘనంగా శ్యామా ప్రసాద్ ముఖర్జీ ‘బలిదాన్ దివస్’

కరీంనగర్: భారతీయ జనసంఘ్ వ్యవస్థాపకులు డాక్టర్ శ్యామ ప్రసాద్ ముఖర్జీ కన్న కలలను ప్రధాని నరేంద్ర మోదీ నాయకత్వంలోని కేంద్ర ప్రభుత్వం అక్షరాలా నెరవేరుస్తోందని బీజేపీ పార్లమెంట్ కన్వీనర్ బోయినపల్లి ప్రవీణ్ రావు అన్నారు. శ్యామ ప్రసాద్ ముఖర్జీ బలిదాన్ దివస్ సందర్భంగా కరీంనగర్ పార్లమెంటు కార్యాలయంలో వేడుకలు నిర్వహించారు. ఈ సందర్భంగా ప్రవీణ్ రావు ముందు శ్యామ ప్రసాద్ ముఖర్జీ చిత్రపటానికి పూలమాలలు వేసి, ఘన నివాళులు అర్పించారు ఆయన చేసిన కృషిని, త్యాగాలను ప్రవీణ్ రావు స్మరించుకున్నారు.

ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.ఏక్ భారత్ - శ్రేష్ఠ భారత్ దిశగా మోదీ ప్రభుత్వం అడుగులు వేస్తోందని, జమ్మూ కాశ్మీర్‌కు ప్రత్యేక హోదా కల్పించే ఆర్టికల్ 370ని రద్దు చేయడం ద్వారా ముఖర్జీ ఆశయాలకు నిజమైన నివాళి అర్పించామని తెలిపారు. దేశ సమగ్రత, ఐక్యత కోసం ప్రాణత్యాగం చేసిన గొప్ప వ్యక్తి అని, ఆయన మార్గంలోనే దేశాభివృద్ధి జరుగుతోందన్నారు.

దేశ ప్రజలందరూ ప్రధాని మోదీ నాయకత్వాన్ని బలపరుస్తున్నారని, దేశంలో కాంగ్రెస్ ముక్త్ భారత్ అయ్యే రోజులు దగ్గరలోనే ఉన్నాయని ప్రవీణ్ రావు జోస్యం చెప్పారు. ప్రజా వ్యతిరేక విధానాలు, అవినీతితో నిండిన కాంగ్రెస్ పార్టీని ప్రజలు తిరస్కరిస్తున్నారని, రాబోయే రోజుల్లో దేశవ్యాప్తంగా బీజేపీ తిరుగులేని శక్తిగా అవతరిస్తుందని ఆయన ధీమా వ్యక్తం చేశారు. కేంద్ర ప్రభుత్వ పథకాలు సామాన్యులకు అందుతున్న తీరును చూసి, ప్రధాని మోదీ 12 ఏళ్ల పాలన ను చూసి ప్రతిపక్షాలు బెంబేలెత్తిపోతున్నాయన్నారు.

G. SUDHAKAR, KARIMNAGAR

G. SUDHAKAR, KARIMNAGAR

Next Story