Karimnagar: బోయవాడలో వైభవంగా గంగమ్మ తల్లి బోనాలు ఎత్తిన గంగుల కమలాకర్!

Karimnagar: కరీంనగర్ బోయవాడలో గంగమ్మ తల్లి బోనాల ఉత్సవాలు. శిరస్సుపై బోనం ఎత్తి ఊరేగింపులో పాల్గొన్న కరీంనగర్ ఎమ్మెల్యే గంగుల కమలాకర్.

SUDHAKAR, KARIMNGAR TOWN
Published on: 16 Aug 2026 5:08 PM IST
Karimnagar
X

Karimnagar: బోయవాడలో వైభవంగా గంగమ్మ తల్లి బోనాలు ఎత్తిన గంగుల కమలాకర్!

Karimnagar: కరీంనగర్ జిల్లా కేంద్రంలోని బోయవాడలో గంగమ్మ తల్లి బోనాల వేడుకలను అత్యంత వైభవంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో కరీంనగర్ ఎమ్మెల్యే, మాజీ మంత్రి గంగుల కమలాకర్ ముఖ్య అతిథిగా పాల్గొన్నారు.

అమ్మవారికి ప్రత్యేక పూజలు నిర్వహించిన అనంతరం ఆయన బోనం ఎత్తుకొని ఊరేగింపులో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ గంగమ్మ తల్లి దివ్య ఆశీస్సులతో ప్రజలందరూ ఆయురారోగ్యాలతో, సుఖసంతోషాలతో వర్ధిల్లాలని ఆకాంక్షించారు.

​ఈ వేడుకల్లో బీఆర్ఎస్ నగర అధ్యక్షుడు చల్ల హరిశంకర్, మాజీ మేయర్ సర్దార్ రవీందర్ సింగ్, మాజీ గ్రంథాలయ సంస్థ చైర్మన్ పొన్నం అనిల్ కుమార్ గౌడ్, కార్పొరేటర్ తాటి ప్రభావతి, మాజీ కార్పొరేటర్ సోహన్ సింగ్, ఆలయ కమిటీ అధ్యక్షుడు గడప మల్లేశంలతో పాటు స్థానిక నాయకులు కర్ర సూర్య శేఖర్, కన్న కృష్ణ, నేతి రవి వర్మ, గంగాధర చందు, స్వామి, నవీన్, ఆలయ కమిటీ ప్రతినిధులు, పెద్ద సంఖ్యలో భక్తులు పాల్గొన్నారు.

SUDHAKAR, KARIMNGAR TOWN

SUDHAKAR, KARIMNGAR TOWN

Next Story