Karimnagar: కరీంనగర్‌లో ఘనంగా జాతీయ చేనేత దినోత్సవ వేడుకలు
Karimnagar: కరీంనగర్ 39వ డివిజన్‌లో బీజేపీ ఆధ్వర్యంలో జాతీయ చేనేత దినోత్సవం. హాజరైన జిల్లా అధ్యక్షులు సాయిని మల్లేశం, మేయర్ కొలగాని శ్రీనివాస్.
Karimnagar: కరీంనగర్‌లో ఘనంగా జాతీయ చేనేత దినోత్సవ వేడుకలు
కరీంనగర్: భారతీయ జనతా పార్టీ జిల్లా శాఖ ఆధ్వర్యంలో కరీంనగర్ 39వ డివిజన్ లోని చేనేత సహకార సంఘం కార్యాలయం వద్ద జాతీయ చేనేత దినోత్సవాన్ని అత్యంత వైభవంగా నిర్వహించారు. ఈ వేడుకలకు బిజెపి జిల్లా అధ్యక్షులు సాయిని మల్లేశం, నగర మేయర్ కొలగాని శ్రీనివాస్ ముఖ్య అతిథులుగా విచ్చేశారు.
ఈ సందర్భంగా వారు చేనేత మగ్గాన్ని నేసి, మగ్గం యొక్క పనితీరు తెలుసుకొని, చేనేత కార్మికుల అద్భుతమైన కళానైపుణ్యాన్ని అభినందించారు.
ఈ సందర్భంగా సాయిని మల్లేశం, కోలగాని శ్రీనివాస్ లు మాట్లాడుతూ ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ చేనేత కార్మికుల కళానైపుణ్యాన్ని ప్రపంచవ్యాప్తంగా పరిచయం చేయడానికి, చేనేత ఉత్పత్తులకు అంతర్జాతీయ స్థాయిలో గుర్తింపు మార్కెటింగ్ కల్పించడం కోసం ఎంతో కృషి చేశారని తెలిపారు.
ఆ దిశలోనే 2015 ఆగస్టు 7 తేదీని జాతీయ చేనేత దినోత్సవంగా ప్రకటించారని గుర్తుచేశారు. దేశ స్వాతంత్ర్య ఉద్యమంలో విదేశీ వస్త్ర బహిష్కరణ , స్వదేశీ ఉద్యమంలో చేనేత కార్మికులు అందించిన సేవలు, వారి పాత్ర ఎంతో గొప్పవని కొనియాడారు.
ఈ కార్యక్రమంలో భాగంగా చేనేత అధ్యక్షులు, డైరెక్టర్లు, సంఘ సభ్యులను ఘనంగా సన్మానించారు. చేనేత కార్మికులకు అన్ని రకాలుగా అండగా నిలుస్తామని ఈ సందర్భంగా హామీ ఇచ్చారు.
ఈ కార్యక్రమంలో కార్పొరేటర్లు వాసాల రమేష్, వేముల చంద్ర శేఖర్ తెళ్ళ రమేష్, చొప్పరి జయశ్రీ, మాసం గణేష్, సరస్వతి సత్యం, గుంజెటి మెతుకు సత్యం, శివన్న, అడిచర్ల రాజు, సతీష్, మునిందర్ లతో పాటు చేనేత సంఘ సభ్యులు / డైరెక్టర్లు బోగా భద్రయ్య, చంద్రయ్య, గుర్రం ఆంజనేయులు, శ్రీపతి వెంకటేశం, తుమ్మ రామస్వామి, ఆరకాల కనకయ్య. భారీ సంఖ్యలో మహిళలు, చేనేత సంఘ సభ్యులు , స్థానికులు పాల్గొన్నారు.




