Karimnagar: ఆరోపణలు చేసే ముందు రవీందర్ సింగ్ ఆత్మవిమర్శ చేసుకోవాలి సునీల్ రావు
Karimnagar: యుడీఎఫ్ నిధులపై బిఆర్ఎస్ నేత రవీందర్ సింగ్ చేసిన ఆరోపణలను ఖండించిన కరీంనగర్ డిప్యూటీ మేయర్ సునీల్ రావు. క్షమాపణ చెప్పకుంటే చట్టపరమైన చర్యలు హెచ్చరిక.
Karimnagar: ఆరోపణలు చేసే ముందు రవీందర్ సింగ్ ఆత్మవిమర్శ చేసుకోవాలి సునీల్ రావు
కరీంనగర్: ఆరోపణలు చేసే ముందు బీఆర్ఎస్ నాయకులు రవీంధర్ సింగ్ ఆత్మవిమర్శ చేస్కోవాలని బీజేపి రాష్ట్ర అధికార ప్రతినిధి నగర డిప్యూటీ మేయర్ యాదగిరి సునీల్ రావు మండి పడ్డారు యూడిఎఫ్ లో అవినీతి కోట్ల రూ. జరిగిందనే అసత్య ఆరోపణల పై ఆయన ఫైర్ అయ్యారు. కరీంనగర్ లోని ఎస్ బి ఎస్ ఫంక్షన్ హోల్ లో శుక్రవారం విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ... రవీంధర్ సింగ్ ఆరోపణలు చేసే ముందు ఆత్మవిమర్శ చేస్కుంటే చాలా మంచిదని హితువు పలికారు.
కరీంనగర్ నగర అభివృద్ధి కి సంబంధించి యూడిఎఫ్ స్కీంలో 180 కోట్లకు అడ్మినిస్ట్రేషన్ సాక్షన్ అయితే 137 కోట్లు ఈసివి వ్యాలు అని స్పష్టం చేశారు. అభివృద్ధి పనులు చేసేది 137 కోట్ల తో అయితే ఇదులో అవినీతి ఎక్కడ జరిగిందని సూటిగా ప్రశ్నించారు. ఈ పథకానికి సంబంధించి టెండర్లు నిర్వహించి... ఆమోదం తెలిపేది రాష్ట్ర ప్రభుత్వం అయితే ఇందులో 30 నుండి 40 కోట్ల రూపాయల అవినీతి ఏ విధంగా జరిగిందో అర్థం కావడం లేదంటూ... ఎద్దేవ చేశారు.
రవీంధర్ సింగ్ చేసిన ఆరోపణలు బాధ్యాత రహిత ఆరోపణలని భావిస్తున్నట్లు మండి పడ్డారు. చేసిన అనవసరప ఆరోపణలకు రవీంధర్ సింగ్ వెంటనే క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు. లేదంటే న్యాయపరంగా చర్యలు తీస్కోక తప్పదని హెచ్చరించారు. ఏదిపడితే మాట్లాడుతూ.... ఆరోపణలు చేయడం సరికాదని హెచ్చరించారు. రవీంధర్ సింగ్ ఆరోపణలు చేస్తున్నానంటూ... చెప్పకోవడంలో ఆంతర్యమేంటని నిప్పులు చెరిగారు.
మీరు ఏది పడితే అధి ఆరోపణలు చేస్తే... పడి ఊరుకోవడానికి ఇక్కడ ఎవ్వరు లేరని ద్వజమెత్తారు. మీరు చేసిన ఆరోపణలతో మీ టార్గెట్ బీజేపి, కాంగ్రెస్ పార్టీ కాదని బీఆర్ఎస్ పార్టీ టార్గెట్ అని తెలిసిపోయిందని మండి పడ్డారు. మీరు మాట్లాడేది 137 కోట్ల రూపాయల టెండర్ విషయం కాదని గతంలో బీఆర్ఎస్ పార్టీ హాయంలో చేసిన టెండర్ గురించి మాట్లాతున్నారన్న విషయం మాకు తెలిసిపోయిందని వ్యంగ్యాస్త్రాలు విసిరారు.
గతంలో పది సంవత్సరాలు బీఆర్ఎస్ పార్టీ అధికారంలో ఉందని...బీఆర్ఎస్ ప్రభుత్వం లో 5 సంవత్సరాలు మేయర్ గా... మరో రెండు సంవత్సరాలు సివిల్ సప్లే చైర్మన్ గా కోనసాగారని ఎన్ని ఎక్సెస్ టెండర్లు జరిగాయో మీకు తెలియదా అని ప్రశ్నించారు..? మీరు ఏ సంస్థ పేరు అయితే చెబుతున్నారో... అదే సంస్థకు బీఆర్ఎస్ ప్రభుత్వం దాదాపు ఆరు వేల కోట్ల రూపాయల టెండర్లు ఇచ్చారని మండి పడ్డారు.
ఈ సంస్థకు 5% ఎక్సెస్ టెండర్లు ఎలా ఇస్తారని మీరు ప్రశ్నించారు కదా... అదే సంస్థకు మీ బీఆర్ఎస్ ప్రభుత్వం 6 వేల కోట్ల రూపాయల పనులను ఎలా కట్టబెట్టిందని దీనికి సమాదానం చెప్పాలని సూచిగా ప్రశ్నించారు. అందులో ఎన్ని వందల కోట్ల రూపాయలు చేతులు మారాయే మీరే సమాదానం చెప్పాలని ద్వజమెత్తారు. మీ పార్టీ పై మీరు ఆరోపణలు చేస్తున్నారని... ఒక్క సారి రవీంధర్ సింగ్ ఆత్మవిమర్శ చేస్కోవాలని హితువు పలికారు. ఇదేనా మీ చిత్తశుద్ధి అని మండి పడ్డారు.
మీరు ఏదైతే సంస్థ పేరు చెబుతున్నారో మీ ప్రభుత్వ ఆయాంలో అదే సంస్థ మిడ్ మానేరు కట్టింది... అదే సంస్థ గౌరవేల్లి రిజర్వాయర్ కట్టింది... అదే సంస్థ తోటపల్లి ప్రాజెక్టు కట్టింది... అదే సంస్థ మల్లన్న సాగర్ కట్టింది... అదే సంస్థ భక్తరామదాసు ప్రాజెక్టు కడుతుందని నిప్పులు చెరిగారు. వీటికి కాంట్రాక్టు ఎవరిచ్చారని.... మీకున్న కక్ష మీ బీఆర్ఎస్ పార్టీ పైనే కదా అని ద్వజమెత్తారు. మీకు ఎమ్మెల్సీకి అవకాశం ఇవ్వలేదనే కక్షతోనే మీ పార్టీ పైనే ఆరోపణలు చేస్తున్నారా అని ఎద్దేవ చేశారు.
ఎక్సెస్ టెండర్లు అనేది పనులు నిర్వహించే సంస్థ పెడితే... టెండర్లు తెరిచేది...ఇచ్చేది ఎవరు...? వాటిని ఆమోదం తెలిపేది ఎవరని.. ప్రశ్నించారు. ఆ మాత్రం తెలియకుండానే పదవులు అనుభవించారా అని సూచిగా ప్రశ్నించారు. కరీంనగర్ లో 546 కోట్లతో నిర్మాణం చేస్తున్న మానేరు రివర్ ఫ్రంట్ లో 4 శాతం ఎక్సెస్ టెండరే అంటూ... మండి పడ్డారు. 4 % ఎక్సెస్ ఎవరి హాయంలో వచ్చింది... ఏ ప్రభుత్వం ఇచ్చిందని మండి పడ్డారు.
ఇవన్ని బయటపడాలనే ఉద్దేశంతోనే మీరు మాట్లాడుతున్నారా... అని ఎద్దేవ చేశారు. కరీంనగర్ లో జరిగిన చెక్ డ్యాంలు అన్ని ఎక్సెస్సే... ప్రాజెక్టులన్నీ ఎక్సెస్సే అని వాటికి మీ సమాదానమేందని నిలదీశారు. ఆ పార్టీలోనే కొనసాగుతూ... ఆ పార్టీ పైనే ఎందుకు ఈ విధంగా వాఖ్యాలు చెస్తున్నారో... మాకు అర్థం కావడం లేదని అన్నారు. మా నాయకులు కేంద్ర మంత్రి బండి సంజయ్ గారికి మీ లాగా మీ నాయకుల్లాగా చౌకబారు ఆలోచనలు... అభిప్రాయాలు ఉండవని స్పష్టం చేశారు.
పది సంవత్సరాలు అధికారంలో ఉండి లక్షల కోట్లు ఎక్సెస్ టెండర్లు ఇచ్చి అవినీతికి పాల్పడింది ఎవరు అని ప్రశ్నించారు..? మీరు చేసిన అనవసరు ఆరోపణల ప్రకారం 180 కోట్లల్లో 30 నుండి 40 కోట్ల అవినీతి జరిగితే... మరీ మీ ప్రభుత్వం ఇచ్చిన ప్రాజెక్టుల టెండర్లలో ఎన్ని కోట్ల అవినీతి జరిగిందో మీరే ఆలోచన చేయాలని హితువు పలికారు. ఒక ఆరోపణ చేసే ముందు... గతంలో జరిగిన పనులను నెమరు వేస్కోని వాఖ్యలు చేయాలని మండి పడ్డారు.
ఈ ప్రభుత్వం అధికారంలోకి వచ్చింది... ఈ ప్రభుత్వం చేసే పనుల్లో కూడ ఎక్సెస్ చెండర్లే అని ద్వజమెత్తారు. తెలంగాణ పబ్లిక్ స్కూల్స్ కు 10 వేల కోట్లతో టెండర్లు జరిగాయి అవి కూడ ఎక్సెస్ చెండర్లే అని మండి పడ్డారు. ఎక్సెక్ టెండర్లు అనేవి సాంకేతికంగా ప్రభుత్వం తీసుకునే నిర్ణయాలన్నారు. చట్టపరంగా ఏ నిర్ణయాలు తీస్కోవాలో ఆ నిర్ణయాలను ప్రభుత్వం తీసుకుంటే.... మీకు మాత్రం అవి అవినీతా అని ద్వజమెత్తారు.
ఎదో ఒక సాకుతో ఇతరుల పై బట్టకాల్చి వేయడం... మీ నైజాం అని నిప్పులు చెరిగారు. ఇదే సంస్థకు కరీంనగర్ స్మార్ట్ సిటీ ప్రాజెక్టులో ప్యాకేజీ 1, ప్యాకేజీ 2 కింద టెండర్లు కట్టబెట్టింది ఎవరని ప్రశ్నించారు. ఇవన్ని కూడ వాస్తవాలు కాదా అని మండి పడ్డారు. మీకు మీ పార్టీ నాయకుల మీద కోసం కక్ష ఉండి ఈ విధంగా అయినా వారి గుట్టు బయటపెట్టాలనే ఆలోచనతో చేస్తున్న వాఖ్యలు అని ద్వజమెత్తారు.
పైకి కలిసి ఉన్నట్టు కనబడుతూ... లోపల ఇంకోలా తీరులా వ్యవహరించడం వాస్తవమ కదా అని ప్రశ్నించారు. ఏ రోజు కూడ మా నాయకులు బండి సంజయ్ కుమార్ స్మార్ట్ సిటీ పై ఎక్కడ ఫిర్యాదు చేయలే అని అది ఆయన నైజాం కాదని స్పష్టం చేశారు. మొన్నటి ఎన్నికల్లో స్మార్ట్ సిటీ ప్రాజెక్టు లో కరీంనగర్ అద్బుతంగా అభివృద్ధి చెందిందని వాస్తవాలు ప్రజలకు తెలిపారని అన్నారు.
అభివృద్ధి చేసినం కాబట్టి మా ఆవకాశం ఇవ్వాలని... ప్రజలను కోరాడంతో మాకు ప్రజలు అవకాశం కట్టబెట్టారని అన్నారు. ప్రజలకు ఇచ్చిన వాగ్ధానాలను నిలబెట్టుకునేందుకు మల్లీ కరీంనగర్ ను యూసిఎఫ్ స్కీంలో చేర్చి... నగర అభివృద్ధి కోసం 840 కోట్ల నిధులు విడుదల చేయించిన ఘనత మా నాయకులు బండి సంజయ్ కుమార్ దని స్పష్టం చేశారు. ఇది అభివృద్ధి చేసే విధానం తప్పా మాకు టెండర్లతో సంబంధం ఉండదని స్పష్టం చేశారు.
గత ప్రభుత్వ ఆహాంలో జరిగిన ప్రాజెక్టుల ఎక్సెస్ టెండర్లు ఎవరు ఇచ్చారో వాటికి సమాధానం రవీంధర్ సింగ్ చెప్పాలని డిమాండ్ చేశారు. మంత్రి బండి సంజయ్ కుమార్ పై అనవసరపు అసత్య ఆరోపణలు చేస్తే... ఖబర్దార్ ఊరుకునే ప్రసక్తే లేదని హెచ్చరించారు. టెండర్లు, కాంట్రాక్టుల బండి సంజయ్ కుమార్ ప్రమేయం ఎక్కడ ఉండదని వెల్లడించారు.
అలాంటి వ్యక్తిని పట్టుకొని అసత్య ఆరోపణలు చేయడం సరికాదని హెచ్చరించారు. అవసరమైతే మీరు చేసిన ఆరోపణల పై ఎలాంటి విచారణ ఆయినా చేస్తోండి.. మాకు ఏం సంబంధం లేదని ద్వజమెత్తారు. మా నాయకుల అనవసరు ఆరోపణలు చేస్తూ... ప్రజల మెప్పు కోసం ప్రయత్నిస్తే ఊరుకోమని హెచ్చరించారు.
ఈ విలేకరుల సమావేశంలో బీజేపీ కార్పొరేటర్లు వొంటెల సత్యనారాయణ రెడ్డి,వంగల పవన్, బండారి వేణు, కొలిపాక శ్రీనివాస్,పొన్నం మొండయ్య, మరియు బిజెపి నాయకులు పండుగ నాగరాజు,వాసు,భాస్కర్,హమీద్, రాజ్ ప్రభాకర్, తదితరులు పాల్గొన్నారు.




