Karimnagar: 'సేవా సంకల్ప్ అభియాన్' కార్యక్రమాలను వెల్లడించిన బండి సంజయ్
Karimnagar: ప్రధాని మోదీ 25 ఏళ్ల ప్రజాసేవను పురస్కరించుకుని సెప్టెంబర్ 17 నుంచి దేశవ్యాప్తంగా 'సేవా సంకల్ప్ అభియాన్' కార్యక్రమాలు. వివరాలు వెల్లడించిన బండి సంజయ్.
Karimnagar: 'సేవా సంకల్ప్ అభియాన్' కార్యక్రమాలను వెల్లడించిన బండి సంజయ్
కరీంనగర్: గుజరాత్ సీఎంగా, దేశ ప్రధానిగా మోదీ 25 ఏళ్ల ప్రజా ప్రస్థానాన్ని పురస్కరించుకుని సెప్టెంబర్ 17 నుండి అక్టోబర్ 17 వరకు బీజేపీ ఆధ్వర్యంలో ‘‘సేవా సంకల్ప్ అభియాన్ – జన్ సేవా హీ ప్రభు సేవా” పేరిట దేశవ్యాప్తంగా విస్త్రత కార్యక్రమాలు చేపట్టనున్నట్లు కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ కుమార్ వెల్లడించారు.
అందులో భాగంగా సెప్టెంబర్ 17న సాయంత్రం 7 గంటలకు ‘ఆశీర్వాద దీపం’ పేరిట మోదీ నిండు నూరేళ్లు ప్రజా సేవలో తరలించాలని భగవంతుడిని వేడుకుంటూ దీపాలను వెలిగించనున్నట్లు తెలిపారు. కేంద్ర ప్రభుత్వ లబ్దిదారులంతా ఈ ఆధ్యాత్మిక కార్యక్రమంలో పాల్గొనాలని పిలుపునిచ్చారు. అదే రోజు పెద్ద ఎత్తున రక్తదాన శిబిరాలను నిర్వహించనున్నట్లు ప్రకటించారు.
సెప్టెంబర్ 17న సాయంత్రం 7 గంటలకు ‘‘ఆశీర్వాద దీపం’’ పేరిట దేశవ్యాప్తంగా అందరం దీపాన్ని వెలిగించి మోదీ నిండు నూరేళ్లు ప్రజాసేవలో తరలించాలని ప్రార్ధిస్తూ భగవంతుడిని వేడుకుంటాం. కేంద్రం నుండి లబ్ది పొందిన వాళ్లంతా ‘‘ఆశీర్వాద దీపం’’ పాల్గొనాలని కోరుతున్నాం. సెప్టెంబర్ 17న పగటిపూట దేశవ్యాప్తంగా రక్తదాన శిబిరాలు నిర్వహిస్తాం.
అట్లాగే “సేవ–అంకితభావం–25 సంవత్సరాలు”, “వికసిత భారతదేశం” అనే అంశాలపై సెప్టెంబర్ 17 నుంచి అక్టోబర్ 7 వరకు ప్రభుత్వ, ప్రైవేట్ పాఠశాలల్లో చిత్రలేఖనం, ప్రసంగ పోటీలు నిర్వహిస్తాం. ప్రధాని మోదీజీ 25 ఏళ్ల ప్రజాసేవను విస్త్రతంగా ప్రజల్లోకి తీసుకెళ్లేందుకు గ్రామాల్లో వివిధ రూపాల్లో విస్త్రుతంగా కళా ప్రదర్శనలు నిర్వహిస్తాం.
‘‘ఆంగన్ మిలన్ సేవ’’ పేరుతో సెప్టెంబర్ 25 నుంచి అక్టోబర్ 7 వర అంగన్‌వాడీ, ఆశా కార్యకర్తలను ఘనంగా సన్మానిస్తాం. మోదీ పాలనలో ప్రజల జీవితాల్లో వచ్చిన మార్పులపై లబ్ధిదారుల అభిప్రాయాలను రీల్స్, వీడియోలను సోషల్ మీడియా ద్వారా ప్రచారం చేస్తాం.
‘సేవా జ్యోతి కలశ యాత్ర – వికసిత భారతదేశ సంకల్పం’’ పేరుతో మోదీ 25 ఏళ్ల ప్రజాసేవకు క్రుతజ్ఝతలు తెలియజేస్తూ అక్టోబర్ 7న గ్రామాలు, ప్రాంతాల్లో యాత్రలు నిర్వహించాలి. 2047 నాటికి వికసిత భారత్ నిర్మాణం కోసం ప్రజలను ఏకం చేయాలి. వడ్నాగర్ నుండివారణాసి, వారణాసి నుండి వడ్నాగర్ పేరిట పవిత్ర నదుల జలంతో వడ్నాగర్ లోని హటకేశ్వర్ మహాదేవ్ ఆలయంలో, వారణాసిలోని కాశీ విశ్వనాథ్ ఆలయంలో జలాభిషేకం చేయాలి.
సెప్టెంబర్ 17 నుండి అక్టోబర్ 17 వరకు ప్రజల భాగస్వామ్యంతో ఏదైనా ఒక సేవా కార్యక్రమంలో పాల్గొనాలి. ‘‘సేవా సేతు అభియాన్’’ పేరుతో సెప్టెంబర్ 17 నుండి అక్టోబర్ 17 వరకు అసెంబ్లీ, మండల స్థాయిలో ప్రత్యేక శిబిరాలు నిర్వహించి కేంద్ర సంక్షేమ పథకాల ప్రయోజనాలను ప్రజలకు ఒకేచోట నేరుగా అందించేలా చేయాలి. దీంతోపాటు ప్రజా సంక్షేమ పథకాలు, జాతీయ చిహ్నాలు, అభివ్రుద్ధి చెందిన భారతదేశ సందేశాన్ని రంగోలి రూపంలో ప్రదర్శించాలి.
సేవా ఫస్ట్ ఇన్నోవేషన్ ఛాలెంజ్ పేరిట యువ ఆవిష్కర్తలను ఒకేచోట చేర్చి కొత్త ఆలోచనలకు, పరిష్కార మార్గాలను కనుగొనేలా కార్యక్రమం నిర్వహించాలి. సుపరిపాలన- సేవా సంవాద్ పేరుతో ప్రధాన నగరాల్లో అక్టోబర్ లో సర్పంచులను, ఇతర స్థానిక ప్రజాప్రతినిధులతో కార్యక్రమాన్ని నిర్వహించాలని నిర్ణయించాం. ఈ విస్త్రత కార్యక్రమాల్లో ప్రజలు, కేంద్ర ప్రభుత్వ లబ్దిదారులు, ప్రజా ప్రతినిధులు పాలుపంచుకోవాలని విజ్ఝప్తి చేస్తున్నా అని అన్నారు.
ఈ మీడియా సమావేశంలో కరీంనగర్ మేయర్ కొలగాని శ్రీనివాస్, డిప్యూటీ మేయర్ సునీల్ రావు, బీజేపీ జిల్లా అధ్యక్షులు సాయిని మల్లేశం, పార్లమెంట్ కన్వీనర్ బోయినిపల్లి ప్రవీణ్ రావు, స్థానిక కార్పొరేటర్లు పాల్గొన్నారు.




