Karimnagar: ఎండలు మండుతున్న వేళ ఆర్యవైశ్యుల చల్లని నిర్ణయం!

Karimnagar: కరీంనగర్ భగత్ నగర్ చౌరస్తాలో ఆర్యవైశ్య సంఘం ఆధ్వర్యంలో చలివేంద్రాన్ని ఏర్పాటు చేశారు.

హెచ్ఎం డిజిటల్ డెస్క్
Published on: 2 April 2026 3:01 PM IST
Karimnagar
X

Karimnagar: ఎండలు మండుతున్న వేళ ఆర్యవైశ్యుల చల్లని నిర్ణయం!

కరీంనగర్: భగత్ నగర్ ఆర్యవైశ్య సంఘ సావకారంతో గత మూడు సంవత్సరాలుగా పాదాచారుల, ప్రజల తీర్చడానికి చలివేంద్రాలు ఏర్పాటు. ఎక్కువ రద్దీ ఉండే ప్రదేశాలలో చలివేంద్రాలను ఏర్పాటు చేస్తున్నట్లు కొల్లూరి హరిప్రసాద్ తెలిపారు.

ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసిన ఆర్యవైశ్య సంఘ జిల్లా అధ్యక్షుడు చిదుర సురేష్ మాట్లాడుతూ ఇలాంటి కార్యక్రమాలు చేయడం చాలా సంతోషమని నిర్వాహకులను అభినందించారు. మానవసేవయే మాధవసేవ అనే నానుడికి రూపకల్పన ఇస్తూ ప్రజల దాహార్తి తీర్చడం కోసం చలివేంద్రం ఏర్పాటు చేయడం సంతోషం. ఎండలు మండుతున్న వేళ ప్రజల దాహార్తి తీర్చడం కోసం మంచినీటి వసతి కల్పించడం, మాధవ సేవతో సమానం అన్నారు. ఆర్యవైశ్య సంఘం ఆధ్వర్యంలో అనేక స్వచ్ఛంద కార్యక్రమాలు నిర్వహించినట్లు, రాబోవు రోజుల్లో కూడా అనేక సామాజిక కార్యక్రమాలు నిర్వహిస్తామని అన్నారు. ఆర్యవైశ్య సంఘం ఒక కుటుంబ సభ్యుల కలిసిమెలిసి ఉండి సామాజిక కార్యక్రమాలలో పాల్గొనడం చెప్పలేని సంతోషాన్ని ఇస్తుందన్నారు.

ఈ కార్యక్రమంలో నూనె విద్యాసాగర్ కొండూరి ప్రసాద్,అల్లాడి రంగయ్య, రావికంటి సత్యనారాయణ, శ్రీనివాస గాంధీ,రామకృష్ణ వైకుంఠం శ్రీనివాసు, వెంకటేశం, సుధాకర్, చంద్రమౌళి మహేష్, రాజేందర్, రామచంద్రన్, శంకరయ్య, ఆంజనేయులు, రమేష్, ఏలూగూరి శంకరయ్య భగత్ నగర్ ఆర్యవైశ్య కుటుంబ సభ్యులు పాల్గొన్నారు.

హెచ్ఎం డిజిటల్ డెస్క్

హెచ్ఎం డిజిటల్ డెస్క్

Next Story