Veenavanka: సీనియర్ కళాకారుడు వేముల పోచమల్లు మృతికి నివాళి

Veenavanka: కరీంనగర్ జిల్లా వీణవంక మండలం కనపర్తి సీనియర్ కళాకారుడు వేముల పోచమల్లు మృతి. భౌతికకాయానికి నివాళులర్పించిన తెలంగాణ రాష్ట్ర కళాకారుల వేదిక.

GANESH, JAMMIKUNTA
Published on: 4 Aug 2026 3:31 PM IST
Veenavanka
X

Veenavanka: సీనియర్ కళాకారుడు వేముల పోచమల్లు మృతికి నివాళి

వీణవంక: కరీంనగర్ జిల్లా, వీణవంక మండలం, కనపర్తి గ్రామానికి చెందిన సీనియర్ కళాకారుడు వేముల పోచమల్లు (70) సంవత్సరములు రాత్రి మరణించినారు. ఇట్టి విషయాన్ని తెలుసుకున్న తెలంగాణ రాష్ట్ర కళాకారుల వేదిక కళాకారులు కనపర్తికి చేరుకొని భౌతిక కాయానికి పూలమాల వేసి ఘనమైన నివాళులర్పించి, వారి కుటుంబానికి ప్రగాఢమైన సానుభూతిని తెలియజేసినారు.

ఈ సందర్బంగా కళాకారులు గోనెల సమ్మన్న,నర్సింగోజు రవీంద్రచారి,పంజాల శ్రీదర్ గౌడు,మాట్లాడుతూపోచమల్లు తన జీవితాన్ని కళలకు అంకితం చేశారని పౌరాణిక, యక్షగాన, సాంఘిక నాటికలు,చిరుతల రామాయణ కళా ప్రదర్శనలతో తనవంతుగా కళలను కాపాడి, కళారంగానికి ఎనలేని సేవలు అందించినారని, వారిని స్మరించుకున్నారు.

ఈ కార్యక్రమంలో తెలంగాణప్రదేశ్ కాంగ్రెస్ కమిటి సాంస్కృతిక సేన కరీంనగర్ జిల్లా అద్యక్షులు గోనెల సమ్మన్న ముదిరాజ్,తెలంగాణ రాష్ట్ర కళాకారుల వేదిక రాష్ట్ర ఉపాధ్యక్షులు నర్సింగోజు రవీంద్ర చారి,కరీంనగర్ జిల్లా అధ్యక్షులు పంజాల శ్రీధర్ గౌడ్,జమ్మికుంట మండల అధ్యక్షులు వేముల అశోక్, వీణవంక మండల అధ్యక్షులు ముత్యాల హుస్సేన్ నాయి, కళాకారులు దాసరి కొమురెల్లి, కనపర్తి గ్రామకళాకారులు తదితరులు పాల్గొన్నారు.

GANESH, JAMMIKUNTA

GANESH, JAMMIKUNTA

Next Story