Karimnagar: ఫీజు రీయింబర్స్‌మెంట్ కోసం కరీంనగర్ కలెక్టరేట్ వద్ద ఉద్రిక్తత!

Karimnagar: 12 వేల కోట్ల ఫీజు రీయింబర్స్‌మెంట్, స్కాలర్‌షిప్ బకాయిలను వెంటనే విడుదల చేయాలని డిమాండ్ చేస్తూ కరీంనగర్ కలెక్టరేట్‌ను ఏబీవీపీ శ్రేణులు ముట్టడించాయి.

SUDHAKAR, KARIMNGAR TOWN
Published on: 18 Aug 2026 11:25 PM IST
Karimnagar
X

Karimnagar: ఫీజు రీయింబర్స్‌మెంట్ కోసం కరీంనగర్ కలెక్టరేట్ వద్ద ఉద్రిక్తత!

కరీంనగర్: తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడి మూడు సంవత్సరాలు కావస్తున్న రాష్ట్రవ్యాప్తంగా పెండింగ్లో ఉన్న 12 వేల కోట్ల ఫీజు రియంబర్స్మెంట్ స్కాలర్షిప్ బకాయిలను విడుదల చేయాలని డిమాండ్ చేస్తూ ABVP కరీంనగర్ శాఖ ఆధ్వర్యంలో కలెక్టరేట్ ముట్టడించడం జరిగింది.

ఈ సందర్భంగా జాతీయ కార్యదర్శి శ్రవణ్ రాజ్ మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్రంలో విద్యార్థులు నిరుద్యోగులు గత ప్రభుత్వ పాలనకు విసిగిపోయి నిరుద్యోగులు విద్యార్థులు ఏకమయ్యి ఇచ్చిన హామీలు నెరవేరుస్తారేమోనని ఆశతో కాంగ్రెస్ ప్రభుత్వాన్ని ఎన్నుకుంటే నేడు విద్యార్థులను నిరుద్యోగులను తీవ్ర ఇబ్బందులకు గురి చేస్తూ చోద్యం చూస్తున్నారు అని తెలిపారు.

రాష్ట్రవ్యాప్తంగా విద్యార్థులకు రావాల్సిన ఫీజులను ఇవ్వకుండా విద్యార్థుల చదువులను మానేసే విధంగా రాష్ట్ర ప్రభుత్వమే కుట్ర చేస్తుందని అన్నారు. గత ప్రభుత్వం విద్యార్థులకు నిరుద్యోగులకు అన్యాయం చేస్తే ప్రభుత్వం కుప్పకూలిందని ఇప్పుడు ఉన్న కాంగ్రెస్ ప్రభుత్వం అదే పాలన కొన సాగిస్తుంది తప్ప ఎలాంటి మార్పు రాలేదని ఆరోపించారు.

ఇది ప్రజా ప్రభుత్వం కాదు ప్రజా వ్యతిరేక విధానాలను అవలంబిస్తున్న విద్యార్థి వ్యతిరేక ప్రభుత్వమని ఎద్దేవ చేశారు. విద్యార్థులు నిరుద్యోగులు శాంతియుతంగా ధర్నాలు చేస్తుంటే వాళ్లకు కావాల్సిన ఉద్యోగాలు ఫీజులను అధికారులను అడుగుతుంటే అక్రమంగా అరెస్టులు చేస్తూ కేసులు పెడుతూ జీవితాలను అంధకారంలో నెట్టుతున్నాయని దుయపడ్డారు.

ఇకనైనా రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మొండి వైఖరి మానుకొని విద్యార్థులకు రావాల్సిన 12 వేల కోట్ల స్కాలర్షిప్లను బకాయిలను విడుదల చేయాలని త్వరితగతిన ఉద్యోగులను భర్తీ చేయాలని డిమాండ్ చేశారు లేనియెడల జార్ఖండ్లో విద్యార్థులు చేసిన విధంగా తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా విద్యార్థుల అంతా ఏకం చేసి రాష్ట్ర ముఖ్యమంత్రి రాజీనామా చేసేంతవరకు ఏబీవీపీ ఉద్యమాలు చేస్తుందని హెచ్చరించారు.

ఈ కార్యక్రమంలో స్టేట్ వర్కింగ్ కమిటీ మెంబర్లు మల్యాల రాకేష్, అజయ్ జిల్లా కన్వీనర్ పూసాల విష్ణు,నగర కార్యదర్శి యోగేష్ రాష్ట్ర హాస్టల్ కన్వీనర్ బామాండ్ల నందు కార్యకర్తలు అజయ్ శివ విగ్నేష్ ఆకాష్ యశ్వంత్ నిత్య బన్నీ రాజేందర్ సూర్య వంశీ తదితరులు పాల్గొన్నారు.

SUDHAKAR, KARIMNGAR TOWN

SUDHAKAR, KARIMNGAR TOWN

Next Story