Kalwa Srirampur: కుల వివక్ష నివారణే పౌర హక్కుల దినోత్సవ ధ్యేయం తహసీల్దార్

Kalwa Srirampur: పెగడపల్లిలో పౌర హక్కుల దినోత్సవం. అంటరానితనం, కుల వివక్ష వీడాలని తహసీల్దార్ రాముడు పిలుపు. బోనాల జాతర ఘటనపై బాధితులకు న్యాయం చేస్తామని హామీ.

Srimanthula Kondal, Peddapalli
Published on: 30 July 2026 6:10 PM IST
Kalwa Srirampur
X

Kalwa Srirampur: కుల వివక్ష నివారణే పౌర హక్కుల దినోత్సవ ధ్యేయం తహసీల్దార్

కాల్వ శ్రీరాంపూర్: గ్రామీణ ప్రాంతాల్లో అంటరానితనం, కుల వివక్షను పూర్తిగా రూపమాపడమే పౌర హక్కుల దినోత్సవ ముఖ్య ఉద్దేశమని కాల్వ శ్రీరాంపూర్ తాసిల్దార్ రాముడు తెలిపారు.పెద్దపల్లి జిల్లా కాల్వ శ్రీరాంపూర్ మండలంలోని పెగడపల్లి గ్రామంలో గురువారం అధికారుల ఆధ్వర్యంలో పౌర హక్కుల దినోత్సవాన్ని నిర్వహించారు.

ఈ కార్యక్రమానికి మండల తహసీల్దార్ రాముడు, ఎస్ఐ సుధాకర్, ఎంపీడీవో సుధాకర్ మరియు గ్రామ సర్పంచ్ ఆరెల్లి రమేష్ ముఖ్య అతిథులుగా హాజరయ్యారు.పెగడపల్లిలో ఇటీవల బోనాల జాతరలో జరిగిన ఘటనపై మాకు న్యాయం జరగలేదని దళిత సామాజిక వర్గానికి చెందిన పలువురు అధికారులను ప్రశ్నించగా తాసిల్దార్ రాముడు తో పాటు అధికారులు సామాజిక వర్గానికి నచ్చజెప్పారు.

ప్రభుత్వపరంగా ఘటనకు సంబంధించి సామాజిక వర్గానికి న్యాయం చేశామని, ప్రభుత్వం దృష్టికి తీసుకువెళ్లి ఇంకా తగిన న్యాయం చేస్తామని వారికి హామీ ఇచ్చారు.​ఈ సందర్భంగా తహసీల్దార్ రాముడు మాట్లాడుతూ... గ్రామీణ ప్రాంతాల్లో అంటరానితనం, కుల వివక్షను పూర్తిగా రూపమాపడమే పౌర హక్కుల దినోత్సవ ముఖ్య ఉద్దేశమని తెలిపారు. ప్రతి పౌరుడికి రాజ్యాంగం సమాన హక్కులను కల్పించిందని, కులం పేరుతో ఎవరినైనా వివక్షకు గురిచేస్తే చట్టరీత్యా కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు.

​గ్రామాల్లో ఎవరైనా పౌర హక్కులకు భంగం కలిగిస్తే తక్షణమే అధికారుల దృష్టికి తీసుకురావాలని సూచించారు. గ్రామంలో ప్రజలందరూ కులమతాలకు అతీతంగా, సోదరభావంతో కలిసిమెలిసి జీవించాలని కోరారు. ​ఈ కార్యక్రమంలో రెవెన్యూ, పోలీస్ శాఖల అధికారులు, పంచాయతీ సిబ్బందితో పాటు గ్రామ ప్రజలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.

Srimanthula Kondal, Peddapalli

Srimanthula Kondal, Peddapalli

Next Story