Kalva Srirampur: కాల్వశ్రీరాంపూర్ జూనియర్ కళాశాలలో మధ్యాహ్న భోజన పరిశీలన

Kalva Srirampur: కాల్వశ్రీరాంపూర్ ప్రభుత్వ జూనియర్ కళాశాలలో మధ్యాహ్న భోజన పథకాన్ని పరిశీలించిన మాజీ ఎంపీపీ గోపగోని సారయ్య గౌడ్. విద్యార్థులకు స్వయంగా వడ్డన.

Srimanthula Kondal, Peddapalli
Published on: 7 Aug 2026 2:33 PM IST
Kalva Srirampur
X

Kalva Srirampur: కాల్వశ్రీరాంపూర్ జూనియర్ కళాశాలలో మధ్యాహ్న భోజన పరిశీలన

కాల్వశ్రీరాంపూర్: తెలంగాణలోని ప్రభుత్వ జూనియర్ కళాశాలల్లో చదువుతున్న ఇంటర్మీడియట్ విద్యార్థులకు పౌష్టికాహారం అందించే ఉద్దేశంతో రాష్ట్ర ప్రభుత్వం మధ్యాహ్న భోజన పథకాన్ని అమలు చేస్తోంది.

దీనిలో భాగంగా శుక్రవారం కాల్వశ్రీరాంపూర్ మండల కేంద్రంలోని ప్రభుత్వ జూనియర్ కళాశాలలో మధ్యాహ్న భోజన అమలవుతున్న తీరును కాల్వశ్రీరాంపూర్ మాజీ ఎంపీపీ గోపగోని సారయ్య గౌడ్ క్షేత్రస్థాయిలో పరిశీలించారు.

​ఈ సందర్భంగా ఆయన భోజన నిర్వాహకులతో మాట్లాడి, విద్యార్థులకు ప్రతిరోజూ నాణ్యమైన, రుచికరమైన మరియు పౌష్టికాహారాన్ని అందించాలని ఆదేశించారు. అనంతరం విద్యార్థులతో ముచ్చటించి భోజన సదుపాయాలు, ఆహార నాణ్యతపై వివరాలు అడిగి తెలుసుకున్నారు. అనంతరం విద్యార్థులకు స్వయంగా భోజనం వడ్డించే కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు.

​ఈ కార్యక్రమంలో కళాశాల ప్రిన్సిపాల్ శ్రీదేవి, యూత్ కాంగ్రెస్ మండల అధ్యక్షుడు సోన్నాయిటెంకం శివరామకృష్ణ, రేషన్ డీలర్ తాండ్ర సురేష్, కళాశాల ఉపాధ్యాయులు, మధ్యాహ్న భోజన నిర్వాహకులు మరియు విద్యార్థులు పాల్గొన్నారు.

Srimanthula Kondal, Peddapalli

Srimanthula Kondal, Peddapalli

Next Story