Karimnagar: కాల్వ శ్రీరాంపూర్‌లో ఉచిత నేత్ర వైద్య శిబిరం
Karimnagar: పెద్దపల్లి జిల్లా కాల్వ శ్రీరాంపూర్ మండల కేంద్రంలో మానేరు లయన్స్ క్లబ్, డాక్టర్ భాస్కర్ మాడేకర్ సౌజన్యంతో ఉచిత నేత్ర వైద్య శిబిరం నిర్వహించారు.
Karimnagar: కాల్వ శ్రీరాంపూర్‌లో ఉచిత నేత్ర వైద్య శిబిరం
Karimnagar: పెద్దపల్లి జిల్లా కాల్వ శ్రీరాంపూర్ మండల కేంద్రంలోని గ్రామపంచాయతీ ఆవరణలో కరీంనగర్ మానేరు లయన్స్ క్లబ్ ఆధ్వర్యంలో, రేకుర్తికి చెందిన ప్రముఖ వైద్యులు డాక్టర్ భాస్కర్ మాడేకర్ సౌజన్యంతో ఉచిత నేత్ర వైద్య శిబిరం ఘనంగా నిర్వహించారు. మానేరు లైన్స్ క్లబ్ అధ్యక్షులు ముత్యం శంకర్ గౌడ్ ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం నిర్వహించారు.లయన్స్ క్లబ్ డిస్ట్రిక్ట్ గవర్నర్ సింహరాజు కోదండ రాములు, మాజీ ఎంపీపీ గోపగోని సారయ్య గౌడ్, సర్పంచ్ బంగారు రమేష్ ముఖ్య అతిథులుగా హాజరై ఈ శిబిరాన్ని ప్రారంభించారు.
ఈ సందర్భంగా డిస్ట్రిక్ట్ గవర్నర్ కోదండ రాములు మాట్లాడుతూ, లయన్స్ క్లబ్ ప్రెసిడెంట్ ముత్యం శంకర్ గౌడ్ సారథ్యంలో ఈ ఏడాది ఆరు ఉచిత చికిత్స శిబిరాలు నిర్వహించి దాదాపు 300 మందికి ఉచితంగా ఆపరేషన్లు చేయించామని తెలిపారు. రేకుర్తి ఐ హాస్పిటల్ ద్వారా 1,60,000 మందికి, బెల్లంపల్లి ఐ హాస్పిటల్ ద్వారా 75,000 మందికి ఇప్పటివరకు ఉచిత ఐఓఎల్ (కంటి శుక్లాల) ఆపరేషన్లు విజయవంతంగా పూర్తి చేశామని పేర్కొన్నారు.
ఈ శిబిరంలో పరీక్షలు నిర్వహించి, శస్త్రచికిత్స అవసరమైన రోగులను వారి సహాయకులతో (అటెండెంట్స్) సహా లయన్స్ క్లబ్ ప్రత్యేక బస్సులో రేకుర్తి ఆసుపత్రికి తరలించారు. వారికి ఉచితంగా n
ఆపరేషన్లు పూర్తి చేసి, తిరిగి రేపు ఉదయం ఉచితంగా గ్రామానికి చేర్చనున్నట్లు నిర్వాహకులు తెలిపారు. కోట్లాది రూపాయల విలువైన ఇలాంటి సేవా కార్యక్రమాలు లయన్స్ క్లబ్ ద్వారా నిరంతరం కొనసాగుతాయన్నారు. ఈ సందర్భంగా మాజీ ఎంపీపీ గోపగోని సారయ్య గౌడ్ మాట్లాడుతూ"మానవ సేవయే మాధవ సేవ" అనే నినాదంతో లయన్స్ క్లబ్ చేస్తున్న సేవా కార్యక్రమాలను,
శంకర్ గౌడ్ బృందం తీసుకున్న ఈ మంచి నిర్ణయాన్ని మాజీ ఎంపీపీ సారయ్య గౌడ్ ప్రశంసించారు. ఈ కార్యక్రమంలో ఉప సర్పంచ్ గోలి సుధాకర్, లయన్స్ క్లబ్ సభ్యులు కృష్ణ, రాజశేఖర్, వేముల విష్ణు, లక్ష్మణ్, నాయకులు మాదాసి సతీష్, ఈద సత్యనారాయణ రెడ్డి, బద్రి కల్వల శ్యాం, రహీం, దుస్స సదయ్య మరియు గ్రామస్తులు పాల్గొన్నారు.




