Kalva Srirampur: కాల్వ శ్రీరాంపూర్‌లో ఘనంగా వైఎస్సార్ జయంతి వేడుకలు!
Kalva Srirampur: పెద్దపల్లి జిల్లా కాల్వ శ్రీరాంపూర్ మండల కేంద్రంలో స్థానిక ఎమ్మెల్యే చింతకుంట విజయ రమణ రావు ఆదేశాల మేరకు వైఎస్ రాజశేఖరరెడ్డి 77వ జయంతి వేడుకలు.
Kalva Srirampur: కాల్వ శ్రీరాంపూర్‌లో ఘనంగా వైఎస్సార్ జయంతి వేడుకలు!
Kalva Srirampur: కాల్వ శ్రీరాంపూర్ మండల కేంద్రంలో కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో మాజీ ముఖ్యమంత్రి, స్వర్గీయ వైయస్ రాజశేఖరరెడ్డి గారి 77వ జయంతి వేడుకలను బుధవారం ఘనంగా నిర్వహించారు. స్థానిక ఎమ్మెల్యే చింతకుంట విజయ రమణ రావు, మాజీ ఎంపీపీ గోపగాని సారయ్య గౌడ్ ల ఆదేశాల మేరకు ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు.
ఈ సందర్భంగా కాంగ్రెస్ పార్టీ నాయకులు వైయస్సార్ చిత్రపటానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. అనంతరం నాయకులు మాట్లాడుతూ.. వైయస్ రాజశేఖరరెడ్డి గారు ప్రవేశపెట్టిన ప్రజా సంక్షేమ పథకాలు, రైతు పక్షపాత విధానాలు, ఉచిత విద్యుత్, ఆరోగ్యశ్రీ వంటి పథకాలు ప్రజల గుండెల్లో నిలిచిపోయాయన్నారు. ఆయన ఆశయ సాధనకు ప్రతి ఒక్కరూ కృషి చేయాలని, పార్టీ బలోపేతానికి పునరంకితం కావాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమం స్థానిక కాంగ్రెస్ శ్రేణుల్లో కొత్త ఉత్సాహాన్ని నింపింది.
ఈ వేడుకల్లో కాంగ్రెస్ పార్టీ జిల్లా ఉపాధ్యక్షుడు ఎంపీ మునీర్ మార్కెట్ కమిటీ చైర్మన్ రామిడి తిరుపతి రెడ్డి, వైస్ చైర్మన్ సబ్బని రాజమల్లు, డైరెక్టర్లు ఎనగంటి రవి, దాగటి రామచంద్రం , ఉప సర్పంచ్ గోలి సుధాకర్, మాజీ సర్పంచ్ మాదాసు సతీష్, మాజీ ఎంపీటీసీ పొట్టలా నర్సయ్య, వార్డ్ సభ్యులు పొట్టల కవిత-నర్సయ్య, అనిత-అన్వేష్, డీలర్ సురేష్, అంకుస్, యూత్ కాంగ్రెస్ నాయకులు శివ రామ కృష్ణ, తాండ్ర కృష్ణ, రహీం, ఐలయ్య తదితరులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.




