Chityala: రిపోర్టర్ రవీందర్‌పై దాడి.. జర్నలిస్టుల భారీ నిరసన!
Chityala: చిట్యాల ఆర్‌బీ న్యూస్ రిపోర్టర్ పుల్ల రవీందర్‌పై జరిగిన దాడిని ఖండిస్తూ జర్నలిస్టులు, ప్రజా సంఘాల నేతలు నిరసన ర్యాలీ చేపట్టారు.
Chityala: రిపోర్టర్ రవీందర్‌పై దాడి.. జర్నలిస్టుల భారీ నిరసన!
చిట్యాల: చిట్యాల RB న్యూస్ రిపోర్టర్ పుల్ల రవీందర్‌పై జరిగిన దాడిని ఖండిస్తూ జర్నలిస్టులు, నాయకులు సంఘాలకు అతీతంగా ఆందోళన చేపట్టారు.. దాడికి కారణమైన వారిని కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేశారు .
చేతుల్లో ప్లకార్డులు పట్టుకుని, నల్ల బ్యాడ్జీలు ధరించిన జర్నలిస్టులు ప్రెస్ క్లబ్ నుంచి ర్యాలీ నిర్వహించారు..ఈ ర్యాలీ అంబేద్కర్ సెంటర్ వరకు కొనసాగింది. అంబేద్కర్ కూడలి లో రిపోర్టర్ పై జరిగిన దాడిని ఖండిస్తూ నిరసన వ్యక్తం చేశారు...దాడికి కారణమైన వారిని శిక్షించాలంటూ నినాదాలు చేశారు..విధి నిర్వహణలో భాగంగా వార్త కవరేజ్ చేసిన జర్నలిస్టు రవీందర్ పై దాడి హేయమైన చర్య అని తీవ్రంగా ఖండించారు.
అనంతరం జర్నలిస్టులు ఎస్పీ కార్యాలయానికి చేరుకున్నారు. ఎస్పీ సిరిశెట్టి సంకీర్త్‌ను కలిసి పుల్ల రవీందర్‌పై దాడికి సంబంధించిన వివరాలను తెలియజేస్తూ వినతిపత్రం సమర్పించారు. జర్నలిస్టులపై దాడులకు పాల్పడే వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని, భవిష్యత్తులో ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా చర్యలు చేపట్టాలని వారు కోరారు. కాగా ఈ విషయం పై స్పందించిన జిల్లా ఎస్పీ సంకీర్త్ తగిన విచారణ జరిపి చర్యలు తీసుకుంటాం అని హామీ ఇచ్చారు.




