Jammikunta: జమ్మికుంట వెంకటేశ్వర స్వామి ఆలయంలో 108 కలశాలతో అభిషేకం!

Jammikunta: జమ్మికుంట వెంకటేశ్వర స్వామి దేవాలయంలో శ్రవణా నక్షత్రం సందర్భంగా 108 కలశాలతో స్వామివారికి ఘనంగా అభిషేకం నిర్వహించారు.

GANESH, JAMMIKUNTA
Published on: 26 Aug 2026 2:17 PM IST
Jammikunta
X

Jammikunta: జమ్మికుంట వెంకటేశ్వర స్వామి ఆలయంలో 108 కలశాలతో అభిషేకం!

Jammikunta: గోవింద నామస్మరణతో శ్రీ వెంకటేశ్వర స్వామికి 108 కల శాలతో అభిషేకం.స్వామి వారి జన్మ నక్షత్రం శ్రవణా నక్షత్రం సందర్భంగా కరీంనగర్ జిల్లా జమ్మికుంట పట్టణంలో శ్రీ వెంకటేశ్వర స్వామి దేవాలయంలో 108 కలశాలతో స్వామివారికి అభిషేకాలు నిర్వహించారు.

గోవింద నామస్మరణతో ఆలయ ప్రధాన అర్చకులు డింగరి హరికృష్ణ ఆచార్యులు వేదమంత్రాలతో స్వామివారికి అభిషేకాలు చేశారు. కలశాలను ఆలయ ప్రాంగణంలో ఊరేగించారు. స్వామివారిని ప్రత్యేకంగా అలంకరింపజేయగా భక్తులు తన్మయం చెందారు.

స్వామివారి జన్మకు నక్షత్రం శ్రవణా నక్షత్రం సందర్భంగా, వర్షాభావ పరిస్థితుల్లో పడుతున్న ఇబ్బందులతో వర్షాలు కురవాలని వేడుకుంటూ స్వామివారికి అభిషేకాలు నిర్వహించామని ఆలయ ప్రధాన అర్చకులు తెలిపారు. ఈ సందర్భంగా శివరామకృష్ణ భజన మండలి బృందం భజనలు తన్మయులను చేశాయి .

GANESH, JAMMIKUNTA

GANESH, JAMMIKUNTA

Next Story